మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో తగ్గించారు అంతే.. ఆ తర్వాత నుంచి పట్టించుకోవడమే మానేశారు. ఒకప్పుడు భారీగా పెంచిన ఈ రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే లేదు. కొత్త ఏడాదిలోనైనా ఈ ధరలను మారుస్తారని వాహనదారులు చూసారు.. కానీ, ఆ రోజు కూడా మార్పు చేయకపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇవి ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ అయితే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.95.82 గా ఉంది.
విశాఖపట్నం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48 లీటర్ డీజిల్ ధర రూ. 96.27 గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 97.51గా ఉంది.