మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.
ఈ సందర్భంగా చిత్రబృందం ఈరోజు చిరంజీవి విశ్వంభర సెట్స్‌కి వెళ్లింది. అక్కడ చిరుతో కలిసి ఫొటోలు దిగారు. వారందరూ నవ్వుతూ గడిపిన తీరు చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే.
చిరంజీవి తాజా చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదొక సోషియో ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్‌లు కథానాయికలగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు.