అమెజాన్ చేతిలో మహర్షి తో పాటు మహేష్ బాబు 26 సినిమా కూడా

0

మహేష్ బాబు చేస్తున్న 26వ సినిమా డిజిటల్ రైట్స్ ను అప్పుడే అమెజాన్ సంస్థ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది.ఇపుడు సినిమా అంటే డిజిటల్ సంస్థ ల చేతిలోనే.
గతం లో వినోదం అంటే అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు.తర్వాత టీవీ వచ్చాక కొంత మంది థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు.ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకొంచం తగ్గింది.
👉ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అంతా.. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ లు వీటిదే హవా. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే జనాలు సినిమాలను పైరసీ సీడీ ల్లో చూసేస్తున్నారు. అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్లు ఎక్కువగా సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి. ♦మహేష్ బాబు మహర్షి కూడా త్వరలో వీటిలో వచ్చేయబోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపుగా రూ. 11 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది అమెజాన్.
👉మహేష్ 26 వ సినిమాను కూడా :
ఇప్పుడు మహేష్ 26 వ సినిమాపై దృష్టి పెట్టింది. ఈ సినిమా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్నది. అయినా అప్పుడే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి అమెజాన్ సంస్థ మంతనాలు జరపడం మొదలుపెట్టింది.

👉మహేష్ 26 కి డిమాండ్ : డిజిటల్ రంగంలో పోటీ ఉండటంతో…పాటు, మహేష్ మహర్షి సూపర్ హిట్ కావడం, అలాగే, అనిల్ రావిపూడి 100 శాతం సక్సెస్ లో ఉండటం,దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందుకే ముందుగానే సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి అమెజాన్ సంస్థ సిద్ధం అయ్యింది.

Leave a Reply