లిటిల్ హార్ట్స్ అంత గొప్ప సినిమా కాదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్

సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు చంద్రహాస్ . ఆటిట్యూడ్ స్టార్ గా నెట్టింట మస్త్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక గతేడాది రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చంద్రహాస్ డ్యాన్స్, ఫైట్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు.
ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు కాయిన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రయాన్ మాట్లాడుతూ .. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ నేను తీసేయల్లన్నా అది పోదు.. నాకు ఆ ట్యాగ్ ప్లస్ అయ్యింది అని చెప్పాడు. అలాగే లిటిల్ హార్ట్స్ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ కామెంట్స్ చేశాడు చంద్రహాస్.
లిటిల్ హార్ట్స్ అనే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్.. కామెడీ అనేదాన్ని నేను అప్పటికప్పుడు నవ్వి అలా వదిలేస్తా.. ఆ సినిమా నాకు తెలిసి అంత గొప్ప సినిమా కాదు. కానీ నేను ఎంజాయ్ చేశా.. చెప్పుకొచ్చాడు. చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రాకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూట్యూబర్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా చేసి హిట్ అందుకున్నాడు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు అలాంటి సినిమా పై చంద్రహాస్ ఇలాంటి కామెంట్స్ చేయడం పై కొంతమంది ఫైర్ అవుతున్నారు.
