హైదరాబాద్ ట్రాఫిక్ అలర్ట్.. జూబ్లీహిల్స్ సిగ్నల్ ఫ్రీ ప్లాన్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్‌ను సులభతరం చేయాలని భావిస్తోంది.
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రయల్ రన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వన్‌వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగించే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి కీలక ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రోడ్లు ఉండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
