తన తాత విషయం లో..జూనియర్ NTR కి..కోపం వచ్చింది..!!?

0

అవును.. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. కారణం ఎన్టీఆర్ జయంతి రోజున ఆయన సమాధిని సరిగ్గా అలంకరించక పోవడమే.సమాధి ఇలాగా వుండేది? ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడారు.

👉విషయం లోకి వెళితే : ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకు హైదరాబాద్ నడిబొడ్డున సమాధులు వున్నాయి?

ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే, ఎఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, భానుమతి లాంటి హేమాహేమీల వంటి వారే కదా? ఎన్టీఆర్ కూడా. మరి వారికి సమాధులు వున్నాయా? హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ సమాధి వుంది. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ వుంది కనుక భారీగా కట్టేసారు. ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే ఎఎన్నార్, సావిత్రి, భానుమతి మాదిరిగా పాపులర్ నటుడు మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు నగరం నడిబొడ్డున సమాధికి స్థలం లభించింది.సరే ఇదంతా వేరే సంగతి.

🔴ఎన్టీఆర్ సమాధిని ఎవరు అలంకరించాలి : ప్రభుత్వమా? సరే ఆ సంగతి అలావుంచితే ఎన్టీఆర్ కొడుకులకు తమ తండ్రి సమాధిని జయంతి సందర్భంగా అలంకరించాలన్న ఆలోచన వుండాలి కదా? అందరూ మళ్లీ కోట్లకు పడగలెత్తిన వారే. వెయ్యి రూపాయల పూలు పెడితే సమాధి నిండిపోతుంది.

ఎన్టీఆర్ కొడుకు ఎమ్మెల్యే, అల్లుడు మాజీ ముఖ్యమంత్రి, ఇలా అందరూ లైమ్ లైట్ లో వున్నవారే.
ఎన్టీఆర్ ఇచ్చిన అపార ఆస్తిపాస్తులను అనుభవిస్తున్నవారే. ఆయన సమాధిని పట్టించుకోకుంటే, వేరే వాళ్లకు ఎందుకు పడుతుంది? ఎందుకు పట్టాలి? ఏదో లాంఛనాన్ని కాస్త తుడిచి, నాలుగు పువ్వులు పెడతారు తప్ప, శోభాయమానంగా ఎందుకు అలంకరిస్తారు?అందుకే జూనియర్ కు మండింది.దానికి బాధ పడ్డాడు కాబట్టే..ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

Leave a Reply