సినీ ప్రేమికులకు శుభవార్త

0

ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట .

👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద నిర్మాత చేతుల్లోనే ఎక్కువ థియేటర్స్ ఉండడం తో చిన్న సినిమాల రిలీజ్ టైములో థియేటర్స్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సినిమా నిర్మించడం కంటే దానిని థియేటర్స్ లలో విడుదల చేయడం పెద్ద సవాల్ గా మారింది. దీంతో చిన్న నిర్మాతలు ప్రభుత్వాలను అదనపు షో లు వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వారి వాదన పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిర్మాతలు వారి వీలును బట్టి ఎన్ని షోస్ కావాలంటే అన్ని షోలు వేసుకోవచ్చు.

🔴గతంలో రిలీజ్ డే రోజే మాత్రమే : ఇది వరకు ఒక సినిమాకి extra show లంటే సినిమా రిలీజ్ డే రోజు మాత్రమే ఉండేది.మహా అయితే 4,5 రోజులు ఉండేది. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తో extra show లు అనేవి ప్రతీ రోజూ పడుతూనే ఉంటాయి.ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్టు కోలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇది ఎప్పటి నుండి అమలు చేస్తారనేది చూడాలి. మనఆంధ్ర లో కూడా ఇలాంటిది చేస్తే ఎంతో బాగుంటుందని నిర్మాతలు..ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

Leave a Reply