కాకి గురించి మీకు తెలుయని విషయాలు

0

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది.
🔴కాకి పుట్టుక :
కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక.

కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం
నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది. కాని అతడు పాపి. ఈమె పవిత్ర స్త్రీ. అతని పాపాలవల్ల తీవ్రమైన వేడివల్ల అతని భార్య సంసార సుఖం లేక అతణ్ణి గర్గ మహర్షి వద్దకు తీసుకు వెళ్ళగా అతడు ఒక పవిత్ర కొలనులో
స్నానం చేయమన్నాడు. అలా స్నానం చేసి నపుడు అతడు గత
జన్మలలో చేసిన పాపాలన్ని కాకుల రూపంలో ఎగిరి పోయాయి. కాకులు పాపా
నికి ప్రతీకలు .
🔵యముడు కాకి కి ఇచ్చిన ఆశీర్వాదం : మరుతుడనే రాజు మహేశ్వర
సత్రయాగాన్ని చేయగా దేవతలైన ఇంద్రుడు, యముడు తదితర దిక్పాలకులు వస్తారు. ఇది తెలిసిన రావణుడు అక్కడికి రాగా దేవతలు భయపడి రకరకాల పక్షుల రూపంలో ఎగిరిపోతారు. ఆ సమయంలో యముడు కాకిగా మారతాడు . కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు. 👉తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు. యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.

Leave a Reply