అక్కడ అందరూ గట్టిగా కొడుతుంటారు అంటున్న జబర్దస్త్ శాంతి స్వరూప్

0
Jabardasth santhiswaroop

Teluguwonders:

ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే ‘జబర్ధస్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్‌లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్‌లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

🔴లేడీ గెటప్పులే ఎందుకు:

ఎప్పుడు లేడీ గెటప్పులే వేస్తారెందుకు అని అడిగిన ప్రశ్నకు ‘‘లేడీ గెటప్స్ వేయడం వల్ల మాకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు నా పాత్ర బాగుంటుందని, ‘జబర్దస్త్’లో ఎంట్రీ సాంగ్‌తో నా ప్రవేశం బాగుందని చాలా మంది చెబుతారు. అప్పుడు ఆనందంగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం ఎప్పుడూ తమ మాటలతో ఇబ్బంది పెడుతుంటారు” అని శాంతి స్వరూప్ తెలిపాడు.

🔴ఆ రోజు ఆది ఇష్టం లేకపోయినా చేశాడు:

కొద్దిరోజుల క్రితం ప్రసారమైన స్కిట్‌కు సంబంధించిన రహస్యాన్ని శాంతి స్వరూప్ బయటపెట్టాడు. ‘‘మేము ఈ మధ్య ఓ స్కిట్ చేశాం. అందులో అందరం మిరపకాయలు తినాలి. మా సంగతి ఓకే కానీ, ఆది గారికి కారం అంటే నచ్చదు. అలాంటిది స్కిట్ కోసం ఇష్టం లేకపోయినా ఆయన తినేశారు. మేము కూడా తిన్నాం. ఆ తర్వాత అందరి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోయాయి” అని చెప్పుకొచ్చాడు.

🔴గట్టిగా కొడతారు:

స్కిట్ జరుగుతున్న సమయంలో ఎన్నో సార్లు నిజంగానే కొట్టుకుంటామని శాంతి స్వరూప్ చెప్పాడు. ‘మేము స్కిట్‌లో ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం వల్ల ఎన్నో సార్లు నిజంగానే కొట్టుకున్నాం. స్టేజ్ మీద ఉన్నప్పుడు నొప్పి తెలియదు కానీ, కిందికి దిగిన తర్వాత మాత్రం ఏంటి అంత గట్టిగా కొట్టావ్ అని నవ్వుకుంటూ ఉంటాం’ అని వివరించాడు.

🔴 అందరూ ఇష్టమే :

జబర్ధస్త్ మొత్తంలో ఏ టీమ్ అంటే ఇష్టమన్న ప్రశ్నకు.. ‘నేనే చేసే ఆది గారి టీమ్, అవినాష్ గారి టీమ్ రెండూ ఇష్టమే. నాకు రెండింటిలో మంచి రోల్స్ ఇస్తారు. మా రెండు టీమ్స్ కాకుండా.. ఫ్యామిలీ స్కిట్లు చేసే చమ్మక్ చంద్ర అంటే ఇష్టం. ఆ తర్వాత రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఇలా అందరూ ఇష్టమే’ అని పేర్కొన్నాడు.

🔴హైపర్ ఆది అలా అన్నా పర్వాలేదు:

ఇంటర్వ్యూలో హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాడు శాంతి స్వరూప్. ‘‘ఆదితో స్కిట్ చేస్తే అతడు నాపై పంచులు వేస్తుంటాడు. వాటి వల్ల నాకు బాధ అనిపించదు. పైగా, వాటి వల్లే నాకు మంచి పేరు వచ్చింది.నేనిలా ఉండడానికి ఆదినే కారణం. ఆయన పంచులు వేసినా అవి షో వరకే అని అందరూ గుర్తించాలి. చాలా మంది ఇదే విషయమై నన్ను అడుగుతూనే ఉంటారు. వాళ్లందరికీ ఇదే నా సమాధానం” అంటూ చెప్పుకొచ్చాడు ఈ జబర్ధస్త్ కమెడియన్.

Leave a Reply