జగన్‌ను చూసి జనసేనాని కి భయం పట్టుకుంది అంటున్న నేతలు

0

Teluguwonders:

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. జనసేనాని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వారు ఫైర్..అవ్వుతున్నారు. పవన్ గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు .

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు. వైఎస్సార్‌సీపీ సర్కార్‌పై ఎదురు దాడికి దిగారు. పవన్ విమర్శలపై అధికార పార్టీ నేతలు కూడా కౌంటర్లు మొదలు పెట్టారు.. జనసేనానిపై మండిపడుతున్నారు.

🔴జన సేనాని పై మంత్రుల ఫైర్ :

రియల్ హీరో వైఎస్‌ జగన్‌ను చూసి.. సినీ హీరో తట్టుకోలేకపోతున్నారన్నారని.. అందుకే వైఎస్సార్‌సీపీ పాలనపై విమర్శలు చేస్తున్నారన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్‌నాథ్. పవన్‌ రాజకీయాలను సినిమాలుగా భావిస్తున్నారని.. గాజువాకలో ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి కనీసం ఒక్కసారైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. అమరావతి పేరుతో అవినీతి జరిగిందని.. పవన్ దీనిపై ఎందుకు ప్రశ్నించరన్నారు.
గ్రామ వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై అమర్‌నాథ్‌ మండిపడ్డారు. వాలంటీర్లను కోరియర్‌ బోయ్స్‌, కోరియర్‌ గర్ల్స్‌ అంటూ కించపరచారని.. ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొంత ఊరికి సేవ చేసే అవకాశం వాలంటీర్లకు దక్కిందన్నారు. 👉కాపుల రిజర్వేషన్ల విషయంలో పవన్‌కు కనీస అవగాహన లేదన్నారు. పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదని.. ఆయన వ్యాఖ్యల్ని చూస్తుంటే పెయిడ్, పార్ట్ టైమ్ పొలిటీషియన్ స్థాయి నుంచి ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా అవతారం ఎత్తినట్లుగా ఉందన్నారు. 👉వందరోజుల వేడుకలు సినిమాలకి తప్ప.. రాజకీయ నేతలకు, ప్రభుత్వానికి ఉండవన్నారు. జగన్ ప్రజల ఆశీస్సులతో సీఎం అయ్యారని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.

🔴ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ:

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తే అవగాహన లోపం కనిపిస్తోందన్నారు మరో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పోలవరంలో అవినీతిపై పవన్‌ ఎందుకు ప్రశ్నించరని.. టీడీపీ హయాంలోనే ఇసుక మాఫియా ఆయనకు కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ను చదవడం పవన్‌ మానేస్తే మంచిదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మూడు నెలల్లోనే 19 రకాల చారిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చారన్నారు.

🔴ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ :

చంద్రబాబుకు పవన్‌ రహస్య స్నేహితుడిని.. బాబు చేసిన అక్రమాలను ప్రశ్నించని ఆయన.. ఇప్పుడు జగన్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధానిని తరలిస్తారని సీఎం జగన్‌, మంత్రి బొత్స ఎప్పుడైనా చెప్పారా.. రైతుల్ని నిర్లక్ష్యం చేసింది చంద్రబాబు అంటూ మండిపడ్డారు. అమరావతిలో భూసేకరణకు ఒప్పుకోని పవన్‌.. ఆ తర్వాత మాట మార్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారన్నారు. పవన్ చంద్రబాబు స్క్రిప్ట్ చదవడం మానేస్తే మంచిదన్నారు ఎమ్మెల్యే కిలారు రోశయ్య.

Leave a Reply