జ‌గ‌న్ బర్త్ డే స్పెష‌ల్‌… ఏపీకి అదిరిపోయే గిఫ్ట్‌!…

0

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌ర్త్‌డేకు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ స్పెష‌ల్ ఇవ్వ‌నున్నార‌ట‌.. అందుకు స‌ర్వం సిద్దం చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఏపీలో సీఎంగా అధికారం చేప‌ట్టిన త‌రువాత అనేక సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జ‌ల సంక్షేమ కోసం చేప‌డుతున్న ప‌థ‌కాలు ప్ర‌జ‌ల్లో విశేష ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అయితే సీఎం గా జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ‌స్తున్న మొద‌టి బ‌ర్త్ డే. ఈ బ‌ర్త్ డే చరిత్ర‌లో నిలిచిపోయేలా.. ప్ర‌జ‌లకు జీవితాంతం ఉప‌యోగ‌ప‌డేలా ఉండే ఓ సంక్షేమ ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తుంది.

ఇంత‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ బ‌ర్త్ డే ఎప్పుడు.. ఆయ‌న ప్రారంభించ‌బోయే సంక్షేమ ప‌థ‌కం ఏమిటి అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్ పుట్టిన రోజు డిసెంబ‌ర్ 21. ఆ రోజున సీఎంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు అందించ‌బోతున్న వ‌రం ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంను కొత్తగా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. త‌న తండ్రి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ఆరోగ్య శ్రీ ప‌థ‌కాన్ని టీడీపీ ప్ర‌భుత్వం అస్త‌వ్య‌స్తంగా చేశార‌ని వైఎస్ జ‌గ‌న్ ఎప్ప‌టికి ఆరోపించేవారు.

అంతే కాదు ఈ ప‌థకంలో కేవ‌లం 1000 వ్యాధుల‌కు మాత్ర‌మే చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎంగా జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన త‌రువాత వాటిని 2వేల‌కు పెంచారు. ఇప్పుడు ఆరోగ్య శ్రీ‌లో 2వేల వ్యాధుల‌కు చికిత్స చేసేలా ప‌థ‌కాన్ని రూపొందిస్తున్నారు. అంతే కాదు ఈ ప‌థ‌కంలో ప్ర‌తి వ్య‌క్తి కి సంబంధించిన ఆరోగ్య వివ‌రాలు న‌మోదు చేసి ఉంచుతారు. ఎవ‌రైనా త‌న కార్డును ప‌ట్టుకుని ఆస్ప‌త్రికి వెళితే వారి అనారోగ్యంకు సంబంధించిన వివ‌రాలు అన్ని తెలిసిపోతాయట‌. అందుకే జ‌గ‌న్ బ‌ర్త్ డే రోజున ఆరోగ్య శ్రీ కొత్త కార్డును ఇవ్వ‌నున్నారు. ఇప్ప‌టికే వైద్య రంగంలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టిన జ‌గ‌న్ ఇప్పుడు ఆరోగ్య శ్రీ ప‌థ‌కం అమ‌లు లో కూడా కొత్త పంథాలో వెళ్ళ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద కేవ‌లం ఏపీలోనే కాకుండా హైద‌రాబాద్‌, చెన్నై, బెంగుళూరు న‌గ‌రాల్లోని ఆస్ప‌త్రుల్లో కూడా వైద్యం చేయించుకోవ‌చ్చు. ఇలా పేద‌ల‌కు ఆరోగ్యం అందించేందుకు జ‌గ‌న్ ముందుగానే ప్లాన్ చేసి త‌న పుట్టిన రోజున ప్ర‌జ‌ల‌కు కానుక‌గా ఇవ్వ‌నున్నార‌ట‌..!

Leave a Reply