యువతలో విజయ కాంక్షను రగిల్చే అబ్దుల్ కలాం……

0

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. యువతలో ఎదగాలన్న కాంక్షను రగిల్చే సూక్తులు మీకోసం..

దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. 1931లో జన్మించిన కలాం.. రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. పదవీ కాలం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోకుండా.. తనకు ఇష్టమైన బోధన పట్ల మక్కువ చూపారు. ఐఐఎం షిల్లాంగ్‌లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ.. కుప్పకూలిపోయారు.

కలాం జీవితం మొత్తం విశ్రాంతి లేకుండా పని చేశారు. తొలి విజయం సాధించాక ఆగిపోకండి.. మొదటిసారి గెలిచి, రెండోసారి ఓడితే.. తొలి విజయం అదృష్టవశాత్తూ వచ్చిందంటారు.. అని యువతకు కలాం సందేశాన్నిచ్చారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించడని కలాం చెప్పిన సూక్తి యువతకు ఆదర్శం. మనిషికి కష్టాలు ఎంతో అవసరం… కష్టాలు వచ్చినప్పుడే.. విజయాన్ని ఆస్వాదించగలం అని ఆయన జీవిత సారాన్ని భోధించారు.

పురస్కారాలు

సంవత్సరం పురస్కారం అందచేసినవారు
2014 సైన్స్ డాక్టరేట్ ఎడిన్బర్ విశ్వవిద్యాలయం
2012 గౌరవ డాక్టరేట్ సైమన్ ప్రేజర్ విశ్వవిద్యాలయం
2011 IEEE గౌరవ సభ్యత్వం IEEE
2010 ఇంజనీరింగ్ డాక్టర్ వాటర్లూ విశ్వవిద్యాలయం
2009 గౌరవ డాక్టరేట్ ఒక్లాండ్ యూనివర్సిటీ
2009 హూవర్ పతకం ASME ఫౌండేషన్, USA
2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA
2008 ఇంజనీరింగ్ డాక్టర్ నాణ్యంగ్ టెక్నాలజి విశ్వవిద్యాలయం,సింగాపుర్
2007 కింగ్ చార్లెస్ II పాతకం రాయల్ సొసైటీ, UK
2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ వోల్వర్థాంప్టన్ యొక్క విశ్వవిద్యాలయం, UK
2000 రామానుజన్ అవార్డ్ ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై
1998 వీర్ సావర్కర్ అవార్డు భారత ప్రభుత్వం
1997 నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్
1997 భారతరత్న భారత ప్రభుత్వం
1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం)
1990 పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం
1981 పద్మ భూషణ్ భారత ప్రభుత్వం

 

 

Leave a Reply