ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి ప్రారంభించిన హుందాయ్ ఒకేరోజు భారీగా కార్లను విడుదల చేసింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి దాదాపు 200 కార్లను విడుదల చేసింది.
లాక్ డౌన్ సడలింపులతో తిరిగి ఉత్పత్తులను ప్రారంభించిన హుందాయ్.. ప్రామాణిక ఆపరేటింగ్ విధానానికి అనుగుణంగా 100శాతం భౌతిక దూరాన్ని నిర్ధారిస్తూ కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ఫ్యాక్టరీ ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి 360 డిగ్రీ సేఫ్టీతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించినట్టు తెలిపింది.
‘ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, హ్యుందాయ్ గ్లోబల్ విజన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, ఉత్పాదక కార్యకలాపాల ప్రారంభం, ఆర్థిక కార్యకలాపాలతో సాధారణ స్థితికి తిరిగి తీసుకురావడానికి హుందాయ్ ప్రయత్నిస్తుంది’ అని కంపెనీ తెలిపింది.