ప్రస్తుతం మన తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ప్రయోగాలు ఎవరు చేస్తారు అంటే చాలా మంది చెప్పే మాట రామ్ చరణ్. రామ్ చరణ్ ఏ ప్రయోగం అయినా సరే చేయడానికి భయపడే అవకాశం ఉండదు అనేది వాస్తవం. తన తండ్రి తో నిర్మాతగా చేసే సినిమాలు అయినా మరొకటి అయినా సరే అతను చాలా వరకు ప్రయోగాలు చేయడానికే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అతని దృష్టి బయోపిక్ మీద పడింది అని సమాచారం. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా అతనికి నష్టాలు ఇచ్చినా సరే అతను ప్రస్తుతం బయోపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు అని సమాచారం.
టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ బయోపిక్ ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు అతను చేస్తున్నట్టు సమాచారం. శ్రీదేవి బయోపిక్ ని తీసుకుని రావడానికి గానూ అతను ఇప్పుడు చాలా వరకు కశాతపడుతున్నాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినపడుతుంది.
అది ఎలా ఏంటీ అనేది పక్కన పెడితే అతను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం నయనతారను అడిగినట్టు తెలుస్తుంది. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ ని చేయడానికి ముందుకు వచ్చింది అని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమెను సైరా షూటింగ్ సమయంలోనే అతను అడిగాడు అని ఆమె అప్పుడు ఆలోచించి చెప్తా అని చెప్పి ఇప్పుడు ఓకే చేసింది అని సమాచారం.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఇప్పటికే ఆమె భర్త బోని కపూర్ ని కూడా అడిగారు అని ఆయన కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి సిద్దమయ్యారు అని సమాచారం. మరి ఈ సినిమా వస్తుందా లేదా చూడాలి.