*బొమ్మ పడాలంటే..!*
*థియేటర్లకు కేంద్రం మార్గదర్శకాలు* కరోనా – లాక్డౌన్ పరిస్థితులతో మూతపడిన థియేటర్లు ఎట్టకేలకు పునఃప్రారంభం కానున్నాయి.
అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరచుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మంగళవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడు నెలలుగా సినిమా హాళ్లు మూసేసి ఉన్నాయి. అక్టోబరు 15 నుంచి అవి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సూచించిన నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సీటుకు సీటుకు మధ్య దూరంతో.. 50శాతం సామర్థ్యంతో హాళ్లు నడుపుకోవచ్చు’ అని తెలియజేశారు.
* సీటుకు సీటుకు మధ్య గ్యాప్‌తో 50శాతం మంది ప్రేక్షకులకు అనుమతి. * ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
* సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యకు * ట్లుగా కౌంటర్లు అందుబాటులోకి తేవాలి.
* టికెట్లు రోజంతా విక్రయించాలి. రద్దీని తగ్గించడానికి ముందస్తు బుకింగ్‌లకు అనుమతివ్వాలి.
* సినిమాకు వచ్చిన వారు తప్పని సరిగా భౌతిక దూరం పాటిస్తూ నడుచుకోవాలి. * భౌతిక దూరం కోసం టికెట్ కౌంటర్లు, థియేటర్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద నేలపై గుర్తులు వేయాలి.
* థియేటర్లోకి ప్రవేశించే ముందు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ఎలాంటి లక్షణాలు లేవని ధ్రువీకరించుకున్నాకే లోపలికి పంపాలి.
* ప్రతిఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసి వాడాలి.
* థియేటర్ ప్రాంగణంలో హ్యాండ్ వాష్, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
* మల్టీప్లెక్స్‌లలో వివిధ స్క్రీన్ల ప్రదర్శనల మధ్య తగిన వ్యవధి ఉండాలి. ఒకే సమయంలో ప్రేక్షకులు బయటకు రాకుండా ప్రణాళికలు రూపొందించి.. ప్రదర్శనలు నిర్వహించాలి.
* థియేటర్లో ఎయిర్ కండీషనింగ్ ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. సరైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* ప్యాక్ చేసిన ఆహారం, పానియాలను మాత్రమే అనుమతించాలి. థియేటర్లో అన్ని కౌంటర్ల వద్ద సాధ్యమైనంత వరకు డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించాలి.
* థియేటర్ స్క్రీన్ లోపల ఆహారాన్ని డెలివరీ చేయడం నిషేధం.
* సినిమా హాల్లో ప్రేక్షకులు పాటించాల్సిన అన్ని జాగ్రత్తల గురించి స్క్రీనింగ్‌కు ముందు, తర్వాత ప్రకటనలు వేయాలి. * విరామ సమయంలో సాధారణ ప్రాంతాలు, వాష్‌రూమ్‌లలో రద్దీని నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. * షో పూర్తయ్యాక మరొక షో ప్రదర్శించే ముందు.. సీట్లను తప్పనిసరిగా శానిటైజేషన్ చేయాలి.
* థియేటర్ ప్రాంగణాన్ని రోజూ క్రిమిసంహారక ద్రావణంతో శుభ్రం చేయాలి. * థియేటర్లలోని అన్ని రకాల సిబ్బంది పీపీఈలు, చేతి తొడుగులు, బూట్లు, మాస్క్‌లు ఉపయోగించాలి. * ఉమ్మివేయడం నిషేధం.
* విశ్రాంతి సమయంలో ప్రేక్షకులు అటూ ఇటూ కదలకుండా సీట్లలోనే ఉండేలా ప్రోత్సహించాలి.
* థియేటర్లలోపల, బయట క్రమం తప్పకుండా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. * పార్కింగ్, మిగతా స్థలాల్లో జనం గుమికూడకుండా తగు చర్యలు తీసుకోవాలి.
* ప్రేక్షకులందరి కాంటాక్ట్ నెంబర్లు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవరికైనా పాజిటివ్ వస్తే కాంటాక్ట్ ట్రేసింగ్కోసం దాన్ని ఉపయోగించాలి.
* థియేటర్లలో ప్రేక్షకులు వ్యవహరించాల్సిన విధానంపై (డూస్ అండ్ డోంట్స్) బాగా కనిపించే చోట్ల బోర్డులు ఏర్పాటుచేయాలి. * కొవిడ్-19 సోకే ముప్పు ఎక్కువ ఉన్న సిబ్బందిని ప్రేక్షకులతో ప్రత్యక్ష సంబంధ కార్యకలాపాల్లో నియమించకూడదు.