అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్*
జైపుర్: యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయనున్నట్లు శ్రీ సిమెంట్ సంస్థ ప్రకటించింది.
ఈ మేరకు ‘‘ప్రాజెక్ట్ నమన్’’ పథకాన్ని సైన్యం నైరుతి విభాగం కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ క్లేర్ శుక్రవారం ఆవిష్కరించారు.
గత 20 ఏళ్ల కాలంలో (1999, జనవరి 1 నుంచి 2019, జనవరి 1 మధ్య) యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు.. గరిష్ఠంగా 4 వేల చ.అడుగుల వరకు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా సిమెంటు సరఫరా చేయనున్నట్లు శ్రీ సిమెంట్స్ తెలిపింది.