వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం

0

మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు. వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి..

ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మీ ఉంటుందని.. తమకు ఆరోగ్యం, ఆదాయం విషయంలో అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.

అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని.. అది బాగుంటేనే మనందరం ప్రశాంతంగా జీవించగలమని నమ్ముతారు. లేదంటే ప్రతిదీ గందరగోళంగా మారుతుంది. అయితే అలాంటి విషయాలను ఇప్పటితరం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అయితే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదట.

అలా చేస్తే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్టేనని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పనులేంటి.. అవి ఎందుకు చేయకూడదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

సాయంత్రం నిద్రపోకూడదు..

మనలో చాలా మందికి సాయంకాలం వేళ ఎక్కువగా నిద్ర వస్తుంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వారి వారి పని పరిస్థితులను బట్టి చాలా మంది సాయంకాలం వేళ నిద్రపోతుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం వేళ నిద్ర పోకూడదంట. అలా నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదట. కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఓసారి ముఖం కడుక్కుని ఏదైనా పని చేసేందుకు ప్రయత్నించండి. అయినా కూడా మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు ఎవరితోనైనా మాట్లాడటం మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది.

చీపురు వాడకూడదు..

సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదట. అంటే ఆ సమయంలో మీ ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోవద్దని కాదు.. ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే.. మీ ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుందట. కాబట్టి సాయంకాలం లోపు చీపరుతో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

తులసి మొక్కకు నీరు వేయొద్దు..

సాయంత్రం వేళలో తులసి మొక్కకు నీరు వేయకుండా ఉండాలట. అదే విధంగా తులసి మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాయలను కోయడం వంటి పనులను అస్సలు చేయకూడదట. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుందట. ఆ తర్వాత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లక్ష్మీదేవి అస్సలు కరుణించదట. అంతేకాదు మీకు అప్పటి నుండి ఎక్కడ లేని కష్టాలు, దరిద్రం వచ్చి చేరుతుందట. కాబట్టి సాయంకాలం ఇలాంటి పనులను అస్సలు చేయకండి..

Leave a Reply