దుర్గారావు జీవితాన్ని మార్చిన ” టిక్ టాక్ ” “Tik tok” that changed Durga Rao’s life

Spread the love

టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు .
అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్ చేస్తా ఉంటాడు. అయ్యా బాబు ఇంక ఆపుతావా ? నీ వీడియోస్ చూసి మాకు పిచ్చి ఎక్కేలా ఉందయ్యా ?? నీకు దండం పెడ్తాము సామి ?? ఇంక ఆపవయ్యా బాబూ…. అంటూ ఈ విధంగా కామెంట్స్ చేసే వాళ్ళు . ఇప్పుడు కాలం మారింది . కాలం ఇప్పుడు దుర్గారావు వైపు ఉంది. మనల్ని తిట్టిన వాళ్ళకి అందరి కంటే ముందుగా కాలమే సమాధానం చెప్తుంది అంటుంటారు. దుర్గారావు జీవితంలో కూడా అదే జరిగింది.
అతన్ని ఎంత మంది తిట్టినా , ఎన్ని సార్లు అవమానించిన …అతను ఏ ఒక్కరిని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అక్కడ అతను తన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాడు . మనుషులు అన్నాక మాటలు అనకుండా ఉండలేరు కదా …అంటారు ?? కానీ అన్ని పట్టించుకుంటే నా జీవితానికి ఏమి జవాబు చెప్పుకోవాలి అంటూ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ఒక్క అడుగు ముందుకేసాడు . ఆ ఒక్క అడుగు అతని జీవితాన్నే మార్చేసింది.

ఒక సంఘటన దుర్గారావు కుటుంబాన్ని బాగా కలిచి వేసింది. దుర్గారావు ఇల్లు కట్టుకోవడానికి చాలా బాధలు పడ్డారు. ఊరి వాళ్ళు ఎవరు అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పు ఇచ్చినా…. వీళ్ళ దగ్గర ఏముందని మళ్ళీ అప్పు తీరుస్తారు అంటూ… ఊరి వాళ్ళు అన్నారని దుర్గారావు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ మాటలు చెప్తూ దుర్గారావు కన్నీరు పెట్టుకున్నారు. ఇంకా బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఊళ్లో వాళ్ళు తిట్టిన మాటలకు ఎవరికి చెప్పుకోలేక చాలా సార్లు దుర్గారావు కన్నీరు మున్నీరైనట్టు తెలిసిన సమాచారం. అప్పుడు వాళ్ళ భార్య దుర్గారావును ఓదార్చడం జరిగింది. ఊళ్లో వాళ్ళు వంద మాటలు అనుకోని , మనమేంటో మనకి తెలుసు , రోజులు ఎప్పుడు ఇలానే ఉండవు కదా అండి మనకి మంచి జరిగే రోజులు కూడా ఉంటాయి అంటూ
దుర్గారావుకు సర్ది చెప్పినట్టు సమాచారం.

దుర్గారావు నాట్య మండలి యూట్యూబ్ ఛానల్ని మొదలు పెట్టిన విషయం మనందరికి తెలిసిందే . ఈ ఛానెలని సెలెబ్రెటీస్ తో ప్రత్యేకంగా దుర్గారావు ప్రమోట్ చేపించుకుంటున్నాడు. ఇప్పటికి శేఖర్ మాస్టర్ , రఘుకుంచె , రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సత్తిపండు , యాంకర్ రవిని కలిసినట్టు తెలిసిన సమాచారం . కలిసిన తర్వాత వాళ్ళతోనే ఛానెల్ని కూడా ప్రమోట్ చేపించుకుంటున్నాడు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. దుర్గారావు తెలివి తేటలకు హ్యాట్సాఫ్ చెప్పాలిసిందే. ఒక సాధారణ మనిషి నుంచి సెలెబ్రెటీ వరకు అతి తక్కువ కాలంలోనే ఎదిగాడు. సెలెబ్రెటీస్ కూడా అతనితో పోటీపడి సెల్ఫీస్ దిగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *