మనందరికీ తెలుసు మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికమో. అయితే దీన్ని మారుస్తూ మద్యం ఆరోగ్యానికి ఉపయోగకరం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై అని మితంగా సేవించమంటున్నారు. మితి మీరి ఏది తీసుకున్న ప్రమాదం అని గుర్తించాలి. అదే ఇప్పుడు మందు విషయంలోనూఆపాదించుకోవాలి అని అంటున్నారు .
మితం గా మద్యం తీసుకోవడం వలన నష్టాలు కంటే, లాభాలే ఎక్కువ ఉన్నాయి అని డాక్టర్లు తెలియచేస్తున్నారు. చాలామందికి ప్రతి రోజూ మందు కొట్టడం చాలా సాధారణమైన విషయం . ఎంత తాగుతున్నారో.ఏది తాగుతున్నారో చూసుకోకుండా ఎక్కడపడితే అక్కడ తాగేస్తున్నట్లు పలు సర్వేల్లో బయటపడింది.మితంగా మందుతాగేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకుంటే మందు తాగినప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకు ఒక పెగ్ మందు మాత్రమేతాగే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అని తెలియ చేస్తున్నారు. తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తాయి అని తెలియచేస్తున్నారు. అలాగే లివర్‌లో ఉండే ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి విష పదార్థాలను ఈ యాంటీ యాక్సిడెంట్లునశింప చేస్తాయి. మద్యం ఎక్కువ తాగేవాళ్లలో జీర్ణాశయంలో మంట వస్తుంటుంది. ఇది రాకుండా ఉండాలంటే ఆపిల్‌ను రోజూ తీసుకుంటే మంచిదని తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఆపిల్‌లో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి విముక్తి కలిగిస్తుంది. అల్లాన్ని ద్రవం రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్‌ను ఆరోగ్యం గా ఉంచుతాయట.
మద్యం అలవాటున్న వారు క్రమం తప్పకుండా,సిట్రస్ జాతి ఫలాలను రోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటే .. అవి లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేస్తాయి. టమాటో,క్యారెట్, పాలకూర, బీట్ రూట్ లాంటివి ఆహారంలో తీసుకుంటే విష వ్యర్థాలను బయటకు పంపుతాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఆహారం లో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మందు తాగుతూ కూడా ఆరోగ్యంగా ఉండండి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.