మారేడుమిల్లి – చింతూరులో ఘోర ప్రమాదం,బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

0

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి – చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు బయలు దేరిన కొద్ది సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో.. బస్సు అదుపుతప్పి లోయలో పడింది. అందులోనూ టూరిస్ట్ స్పాట్ కావడంతో.. అక్కడికి పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

రహదారి.. ప్రమాదకరం:మారేడుమిల్లి-చింతూరు రహదారి లోయలు, గుట్టలతో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ మార్గం మరింత ప్రమాదకరంగా మారింది. దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న ఈ రహదారిలో చాలా నైపుణ్యం ఉన్న డ్రైవర్లు మాత్రమే ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారని.. కొత్తగా వచ్చేవారు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

మారేడుమిల్లి-చింతూరు మధ్య ఘాట్ రోడ్డు ఎక్కువగా ఉంటుంది. లోయలో మధ్యలో కాస్త ఇరుకైన రోడ్డులో ప్రయాణించాలి. అందులోనూ టూరిస్ట్ స్పాట్ కావడంతో పర్యాటకుల తాకిడి ఉంటుంది. ముఖ్యంగా టూరిస్ట్ బస్సులు ఈ ఘోట్‌ రోడ్డులోకి ఎక్కువగా వస్తుంటాయి. గతంలో కూడా రెండు, మూడుసార్లు ప్రమాదాలు జరిగాయి. తాజాగా మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు మారేడుమిల్లి నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

Leave a Reply