Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

సౌత్ ఇండస్ట్రీలో అతడు స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు. ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ?
సాధారణంగా సినీప్రముఖులకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా తారల పర్సనల్ విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరో చిన్నప్పటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం అతడు దక్షిణాదిలో టాప్ హీరో. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.. ? ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ హీరో.. ఆ తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యాక.. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది.. ఆ కుర్రాడు ఎవరో అని.. అతడే కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్. తమిళ చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ హీరో.
అజిత్ తన కెరీర్ ప్రారంభ దశలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. కానీ విమర్శలను స్వీకరిస్తూనే అవకాశాల కోసం ప్రయత్నించాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన అజిత్.. నెమ్మదిగా హీరోగా మారాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అంతేకాదు.. అజిత్ మంచి ప్రొఫెసనల్ కార్ రేసర్ కూడా. ఇప్పటికే అనేక ఫార్మాట్లలో తన టీంతో కలిసి పాల్గొంటూ విజయాన్ని అందుకుంటున్నారు. కేవలం కార్ రేసింగ్ కాదు.. అజిత్ కు ఫోటోగ్రఫీ, ట్రావెలింగ్, బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం.
ఇప్పటికే కన్యాకుమారి టూ లడక్ వరుక బైక్ పై ఒంటరిగా వెళ్లారు. అలాగే ఆయనకు విమానాలు నడిపేందుకు కావాల్సిన పైలట్ లైసెన్స్ ఉంది. ఏరో మోడలింగ్ అంటే విపరీతమైన ఆసక్తి. అజిత్ మిగతా హీరోలకు ప్రత్యేకం. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న హీరో. అలాగే సొంతంగా ఫోన్ కూడా ఉపయోగించరు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
