అధీరా ఫస్ట్ లుక్ విడుదల

n202366564ebd2b5b4d1bfb4d8a53e9e81a086f8d38c33ecb306a09939732d26fe951598bd.jpg

సౌత్‌ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్‌ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి, యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన సినిమా ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత‍్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. రాక్ స్టార్ యశ్‌ను ఓవర్‌ నైట్‌ స్టార్‌ను చేసింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు.

ఈ మూవీలో సంజయ్ దత్ అధీరా పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు మేకర్స్.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights