వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. ఆ పనిచేయడానికి చాలా కష్టపడతాడట

సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు అజిత్. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు.
కోలీవుడ్ హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలో ఇప్పటివరకు దాదాపు 63 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ముందు విడుదలైన విడాముయార్చి సైతం మెప్పించింది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు తనకు ఇష్టమైన కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు అజిత్. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి.సుబ్రమణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్.. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు.
చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు అజిత్. అజిత్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్ ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అజిత్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అజిత్.
రేసింగ్, సినిమాల్లో బిజీగా ఉండటంతో కుటుంబ బాధ్యతలు సరిగ్గా చేసుకోలేకపోతున్నా అని అన్నారు. తన భార్య షాలిని అన్ని బాధ్యతలను తీసుకున్నారని ఆమె లేకపోతే ఇదంతా సాధ్యం కాదు అని తెలిపారు అజిత్. రీసెంట్ డేస్ లో పిల్లలను చూడటం చాలా అరుదైపోయిందని అన్నారు అజిత్. అలాగే తనకు నిద్రపోవడం చాలా కష్టం అని.. అంత త్వరగా తనకు నిద్ర రాదు అని రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాను అని తెలిపాడు అజిత్. చాలా కాలంగా తనకు ఈ సమస్య ఉందని తెలిపారు అజిత్. దాంతో ఈకామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
