చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?

Akhil Akkineni

Teluguwonders:

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల కొడుకులు ఇప్పటికే అరంగేట్రం చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు అందుకని తమ తండ్రి పేరును నిలబెడుతున్నారు. అయితే అక్కినేని కుటుంబం నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటిదాకా హిట్ అందుకోలేకపోయాడు. చేసిన మూడు సినిమాలు ఏవీ కూడా అభిమానులను అలరించ లేకపోయాయి. దీంతో అఖిల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారడంతో కింగ్ నాగార్జున కొడుకు కి ఎలాగైనా హిట్ ఇవ్వడానికి తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే గతంలో తన కెరియర్ లో అద్భుతమైన ‘మన్మధుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఖిల్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలని నాగార్జున భావించిన..అప్పట్లో కుదరలేదు అని ఫిలిం నగర్లో వార్తలు వినపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ‘మన్మధుడు’ సీక్వెల్ విషయంలో కూడా నాగార్జున డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రస్తావించకపోవడం గల కారణం అప్పట్లో అఖిల్ తో త్రివిక్రమ్ సినిమా చేయకపోవటమే అని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అఖిల్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు చాలా బలమైన పాత్ర ని అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య అఖిల్ సినిమా విషయమై చర్చకు వచ్చినట్లు సమాచారం. మరి వచ్చిన ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గాని మరియు అఖిల్ గాని స్పందించాలి. ప్రస్తుతం అక్కినేని అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అక్కినేని అభిమానులు చివరాకరికి అఖిల్ పెద్ద డైరెక్టర్ చేతిలో పడుతున్నాడు అని మరి అఖిల్ కి హిట్ పలకరిస్తుందో… లేదో అని అంటున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights