“మహర్షి “పై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలు.. అవిరైపోయాయా..!!?

నరేష్ అల్లరి నరేష్ గా పాపులర్ అయిన ఈ హీరో కెరీర్ మొదట్లో తన అల్లరి తో అందర్నీ అలరించాడు.కానీ రాను రాను కెరీర్ డౌన్ అవుతుండడం తో మహేష్ తో మహర్షి సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా మీద మహేష్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు అల్లరి నరేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. అందుకే మహర్షి సినిమాలో మహేష్ పక్కన ఎంతో ఇంపార్టెంట్ రోల్ అనగానే వెంటనే అంగీకరించాడు. ఈ సినిమా తనకు ఎంతో ప్లస్ అవుతుందని భావించాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన‘మహర్షి’సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా “అల్లరి” నరేష్ ముఖ్య పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.
👉 కీలక పాత్రలో నటించిన కామెడీ హీరో అల్లరి నరేష్, మహేశ్ తరువాత సినిమాలోనే హైలెట్ గా నిలిచాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నరేష్ నటన చాలా బాగుంది.కానీ వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాల్లో మరింత గాఢత ఉంటే బాగుండేది అని చూసిన వారి ఫీలింగ్.
నరేష్ కి, తన కెరీర్‌కు ఉపయోగపడే స్థాయిలో మాత్రం ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ లేదని థియోటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెప్పుకుంటున్నారట. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మహేష్ వన్ మ్యాన్ షోలా ఉందట. ఇక సినిమా అంతటిని మహేష్ తన భుజాల మీద మోశారని అంటున్నారు. 👉దాంతో ఈ సినిమాపై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలన్ని ఆవిరై పోయాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారట. సో ఇకపై వస్తే సపోర్టింగ్ characters వస్తాయి లేకపోతే మళ్ళీ నరేశ్ ఫ్రెష్ గా కెరీర్ మొదలు పెట్టుకోవాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
