ఆఫీస్ బాయ్ పెళ్లి వేడుకలో అల్లుఅర్జున్ sudden surprise.

Untitled design - 2019-05-29T154510.298

అల్లు అర్జున్ యూత్ లో. ఈ పేరు కి ఓ..క్రేజ్ ఉంది.యూత్ లొనే కాదు తన దగ్గర పనిచేసే స్టాఫ్ వద్ద కూడా చాల అభిమానన్ని సంపాదించాడు కారణం తను కూడా వారిని అంతే అభిమానంగా చూసుకుంటాడు .

👉విషయం లోకి వెళ్తే : బన్నీ ఆఫీసులో బాయ్ గా పనిచేసే శిరీష్ అంటే అల్లు అర్జున్ కు చాల అభిమానం. 👉ఈ అభిమానంతోనే శిరీష్ బాగా డాన్స్ చేస్తాడు అని గ్రహించి అల్లు అర్జున్ అతడిని ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా పెట్టి అతడి కెరియర్ కు సహాయపడుతున్నాడు.

అయితే శిరీష్ మాత్రం తాను కొరియోగ్రాఫర్ గా మారడానికి ప్రయత్నిస్తూనే తాను గీత ఆర్ట్స్ ఆఫీసులో చేస్తున్న బాయ్ ఉద్యోగాన్ని బన్నీ మానమన్నా మానకుండా చేస్తూ బన్నీకి మరింత దగ్గర అయ్యాడు.

🎉పెళ్లి వేడుక లో బన్నీ sudden surprise : ఈ నేపధ్యంలో శిరీష్ పెళ్లి ఈమధ్యనే జరిగింది.

ఈ పెళ్ళికి తాను వస్తానని చెప్పకుండా బన్నీ ఆ పెళ్ళికి వెళ్ళడమే కాకుండా ఆ పెళ్ళి పూర్తి అయ్యేవరకు ఉండి ఆకొత్త దంపతులను ఆశీర్వదించడం బన్నీ మంచి తనానికి నిదర్శనంగా మారింది అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు హోరెత్తిస్తున్నారు. సమ్మర్ హాలిడే ట్రిప్ నుండి ఈమధ్యనే తిరిగి వచ్చిన బన్నీ ఇలా శిరీష్ కు చెప్పకుండా షాక్ ఇచ్చాడు.

తన అభిమానులు కష్టంలో ఉంటే వెళ్ళి చూడటం దగ్గర నుండి వీలైనంత వరకు తన అభిమానులతో టచ్ లో ఉండటానికి బన్నీ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనికితోడు సోషల్ మీడియాలో కూడ యాక్టివ్ గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను ముఖ్యంగా తన పిల్లలతో బన్నీ చేసే హడావిడి గురించి తరుచూ షేర్ చేసే ఫోటోలు వీడియోలు వల్ల బన్నీ సినిమాలలో నటించినా నటించకపోయినా ఎప్పుడు అతడికి సంబంధించిన వార్తలు వైరల్ గా మారుతూ ఉంటాయి..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights