సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి..

Teluguwonders:
ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కి బుల్లితెర టాప్ యాంకర్ శ్యామల తన సోషల్ మీడియాలో ఒక ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటంటే.. తాజాగా జరిగిన పాపికొండలు బోటు ప్రమాదం గురించి ఆమె ఒక తన పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. అలా ఆమె జగన్ కి చేసిన రిక్వెస్ట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతగా వైరల్ అవ్వడానికి శ్యామాల జగన్ కు ఏమని విన్నవించిందో చూద్దాము.
మొన్న పాపికొండల్లో జరిగిన బోటు ప్రమాదంలో చాలా మంది ఎక్కడెక్కడినుండో వచ్చి ఇక్కడా ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉందంటే బోటు నాణ్యతను ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో ఇలా వరుసగా జరగడం చాలా భాదగా ఉంది.
దానిని నివారించాలంటే ఒకటే మార్గం.. బోటు నిర్వహణం ప్రయివేట్ చేతుల్లో పెట్టకూడదు అంటూ ఆమె వ్యాఖ్యానించింది.
డబ్బులు కోసం చేసే ప్రవేటు యాజమాన్యాల పనితీరు అందరికి ప్రమాదాలను కొంతెచ్చిపెడుతుంది. మీరు అది ఒకసారి ఆలోచించండి. దేవుడి సాన్నిదానానికి వచ్చిన వారంతా ఎలా ప్రాణాలను కోల్పోవడం అందరికి భాదకలిగించే విషయం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా ఉండాలంటే తగిన చర్యలు మీరే తీసుకోవాలి. అంటూ ఆమె తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.
మొన్న కృష్ణాలో, నిన్న గోదావరిలో జరిగిన బోటు ప్రమాదాలకు మూలం బొట్ల నిర్వహణ ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉండడమే. ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు కీలక మైన ఈ పరిణామాలను ప్రభుత్వ సారద్యంలోకి తీసుకురావాలి. అప్పుడే ఈ ప్రమాదాలను కొంతవరకు తగ్గించిన వారమవుతాము. అంటూ మనవి చేస్తున్న శ్యామల పేర్కొంది. దీనిపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తారో చూడాలి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
