Andhra Pradesh: గాజులు కొందామని వెళ్లిన మహిళలు.. అక్కడున్నదాన్ని చూసి పరుగో పరుగు.. వీడియో వైరల్..

గాజులు కొందామని వెళ్లిన మహిళలతో షాపు యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గాజుల షెల్ఫ్‌లో నుంచి దాదాపు 6 అడుగుల పొడవున్న పాము బుసకొడుతూ బయటికి వచ్చింది. భయంతో అంతా పరుగులు తీశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గాజులు కొందామని వెళ్లిన మహిళలు ఒక్కసారిగా షాకయ్యారు. గాజుల వెనక ఉన్నదాన్ని చూసి పరుగులు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని నీలం ఫ్యాన్సీ స్టోర్లో ఈ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గాజులు కొనేందుకు షాప్‌కు వచ్చిన మహిళలతో దుకాణం యజమాని ఒక్కసారిగా కంగుతిన్నారు. గాజుల షెల్ఫ్‌లో దాదాపు ఆరు అడుగుల పొడవున్న పాము బయటకు రావడంతో షాపులో భయాందోళన చెందారు.
గాజులు అడిగితే.. పాము ప్రత్యక్షం..
కొందరు మహిళలు నీలం ఫ్యాన్సీ దుకాణానికి వచ్చి గాజులు చూపించమని యజమానిని కోరారు. షెల్ఫ్‌లో ఉన్న గాజుల పెట్టెను తీయడానికి యజమాని తన చేతిని లోపలికి పెట్టగానే, గాజులకు బదులు ఒక్కసారిగా పెద్ద పాము బుసకొడుతూ బయటకు వచ్చింది. దీనిని చూసిన దుకాణం యజమానితో పాటు గాజులు కొనేందుకు వచ్చిన మహిళలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. గాజులు కోసం వెళ్తే పామును చూశామని వినియోగదారులు షాక్ అయ్యారు.
స్నేక్ క్యాచర్ చాకచక్యం
స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ ఉయ్యూరు జయప్రకాష్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన జయప్రకాష్.. చాకచక్యంగా వ్యవహరించి, ఆ షెల్ఫ్‌లో ఉన్న 6 అడుగుల పొడవైన పామును పట్టుకున్నారు. పామును సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో షాపు యజమాని, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాము వలన ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊరట చెందారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
