*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం

0

*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం* *ఐరాస ఆన్‌లైన్‌ సదస్సుకు ఎంపిక* అంతర్వేది, మామిడికుదురు,

Teluguwonders: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు దక్కింది.

ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు.

ఈ విషయాన్ని గ్రీన్‌వార్మ్స్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి, ఆ సంస్థ సఖినేటిపల్లి మండల సమన్వయకర్త సునీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 45మంది పాల్గొననున్నారని, ఇందులో మనదేశం నుంచి దీపిక ఉన్నారని వివరించారు. అంతర్వేది కేంద్రంగా గ్రీన్‌వార్మ్స్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంటు ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జీరోవేస్ట్‌ ప్రాజెక్టు ఏర్పాటైంది. గోదావరి నదీపాయలు, సముద్ర జలాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించడం దీని ఉద్దేశం.

Advertisements

Leave a Reply