గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్!

download

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్…

  • 13 జిల్లాల్లో మొత్తం 9,648 ఖాళీలు
  • అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఖాళీలు
  • డిసెంబరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి
  • అక్టోబరులోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు

ఏపీలో గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తికాగా.. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరడంతో.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ మేరకు ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీనిప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,861 పోస్టులుండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయి. డిసెంబరులోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ వెలువడనుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జూన్ 24 నుంచి జులై 5 వరకు దరఖాస్తులను స్వీకరించారు. పట్టణ(వార్డు) వాలంటీర్ ఉద్యోగాలకు జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జులై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను జిలాల్ల వారీగా విడుదల చేశారు. ఎంపికైనవారిలో కొంత మంది నియామక పత్రాలు తీసుకోలేదు.. మరికొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేనికారణంగా మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…

జిల్లాఖాళీలు
శ్రీకాకుళం200
విజయనగరం823
విశాఖపట్నం370
పశ్చిమ గోదావరి590
తూర్పు గోదావరి1,861
కృష్ణా453
గుంటూరు919
ప్రకాశం592
నెల్లూరు340
చిత్తూరు678
కడప891
అనంతపురం955
కర్నూలు976
మొత్తం9,648

 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights