ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు

ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది.
“ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్‌ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్‌ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్‌ను రూపొందించారు.
సహాయం కోరే సమయం కూడా లేనప్పుడు కేవలం యాప్‌ను ఓపెన్ చేసి ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపినా (షేక్ ట్రిగ్గర్) చాలు తక్షణం కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లిపోతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంటుంది.
ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఈ యాప్ పని చేయడం విశేషం. యాప్ తెరిచి ఓసారి బటన్ నొక్కితే చాలు వెంటనే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ ఫోన్ ఎవరి పేరుపై ఉంది వారి చిరునామా అన్ని వివరాలు పోలీస్ కంట్రోల్ రూంకి చేరిపోతాయి.
ఈ యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ కూడా ఉంది. ఇది కేవలం మహిళల్ని ఉద్ధేశించినప్పటికీ ఆపదలో ఉన్న వృద్ధులు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అవసరమైనప్పుడు సమీపంలో ఉన్న ఆస్పత్రులు, మందుల దుకాణాలు, బ్లడ్ బ్యాంక్‌ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు” అని ఈనాడు తెలిపింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
