AP SSC 10th Results 2025 Live: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల..

ap-ssc-10th-results

Andhra Pradesh 10th Class Results 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలు విడుదల చేశారు..

ప్రభుత్వ బడిలో చదివిన బాలికకు ఏకంగా 600కు 598 మార్కులు

పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థినికి ఏకంగా 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్ధిని ఈ ఘనత సాధించడం విశేషం.

పదో తరగతి ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.. గత ఐదేళ్లలో ఇదే టాప్ స్కోర్

గత ఐదేళ్లలో 2022లో అతితక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అత్యధికంగా ఈ ఏడాదే (2025) ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఏప్రిల్ 24 నుంచి రీకౌంటిగ్‌, రీవెరిఫికేషన్‌కు ఛాన్స్

రీకౌంటిగ్‌, రీవెరిఫికేషన్‌కు ఏప్రిల్ 24 ఉదయం 10 గంటల నుంచి మే 1 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటికగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

 


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights