పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం ఏమిటి.అసలు ఎవరీ అరుంధతి..?

01 Arundhati Vashishta Stars

కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్షి మండలంలో వున్న వశిష్టుని నక్షత్రానికి ప్రక్కనే వెలుగుతుండే మరోనక్షత్రాన్ని చూపిస్తారు పురోహితులు . అదే అరుంధతీ నక్షత్రం. . నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపు చూడమని అంటారు.అరుంధతి ఎవరు అంటే మనలో తెలియని చాలా మంది టక్కున అనుష్క అని చెప్పేస్తారు.అది తప్పు
✡అసలుఅరుంధతి ఎవరు అంటే :బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆ అందమైన వ్యక్తే మన్మధుడు.

✡సంధ్య అరుందతి గా మారడం వెనుక కారణం..!!? :

బ్రహ్మ మన్మధుడిని సృష్టించి ఓ 5 సమ్మోహన బాణాలనిచ్చాడు. వాటిని పరీక్షించాలని తలచి మన్మథుడు బ్రహ్మలోకంలోని వారిపైనే వాటిని ప్రయోగించాడు.దీంతో బ్రహ్మతో సహా అందరూ సంద్య పట్ల మోహానికి గురైయ్యారు.ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి ఈశ్వరుడిని ప్రార్థించగా ఈశ్వరుడు అక్కడకి ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. దీనంతటికీ కారణం మన్మథుడని తలచిన బ్రహ్మ మన్మథున్ని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు.
✡సంధ్యా అపరాధభావం :
♦తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను 4 వరాలు కోరుకొమ్మన్నాడు.
♦ఆ 4 వరాలు :
‘1⃣ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాద’నే వరాన్ని ఆమె కోరుకుంది.

2⃣ ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలని కోరుకుంది,

3⃣తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాల’ని కోరుకుంది.

4⃣తన పేరు చిర స్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, ‘మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు.
నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ’ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.
✡ఇలా సంధ్య అరుంధతి గా మారింది :
సంస్కృత భాషలో ‘అరుం’ అంటే అగ్ని, అని , ‘ధతీ’ అంటే ధరించినదనే అర్థం ఉంది. 🔥 అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె ‘అరుంధతి’ అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది.

అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతా రు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు.

✡అరుంధతి నక్షత్రం యొక్క ప్రత్యేకత : మాఘ మాసాది పంచ మాసాల లోతప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కనిపించదు.అంటే వివాహాలు జరిగే కాలం లొనే ఆవిడ ఆకాశంలో కనిపిస్తుంది.

👉దీనికి సైన్స్ ఏం చెప్తుందంటే : రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుందని సైన్స్ చెప్తుంది.

👉అరుంధతి నక్షత్రం మనకు నిజంగా కనిపిస్తుందా : అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే ఒక చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.? మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. అదే సప్తర్షి మండలం . అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.అరుంధతి అంటే అగ్ని తో సమానమైనది అని అర్ధం..ఆవిడ అంత మహా పతివ్రత కాబట్టే పెళ్లి సమయం లో..ఆవిడని ఆకాశం లో చూపిస్తారు.అరుంధతి లా ఉండాలని ఆశీర్వదిస్తారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights