ఆస్తులు, అంతస్తులు కి ఇచ్చిన విలువ మునుషులు ఇవ్వడం లేదు !!!

Spread the love

ఆస్తులు, అంతస్తులు కి ఇచ్చిన విలువ మునుషులు ఇవ్వడం లేదు ???

ఈ ప్రపంచంలో భిన్న రకాల మనుషులు ఉంటారు. అలాగే విభిన్న రకాల మగవారు ఉంటారు. వారితో పాటు ఆడవారు కూడా రకరకాలుగా ఉంటారు. అయితే కొందరు మగవారు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటారు.

వీరు ఎల్లప్పుడూ మహిళల కన్నా తామే గొప్ప అని తెగ ఫీలవుతుంటారు. అంతేకాదు తాము కలయికలో సక్సెస్ అయితే చాలు తమను తాము ఉన్నతంగా భావిస్తారు. ఇలాంటి పురుషులు ఎప్పటికీ ఒక ఉత్తమమైన ప్రేమికుడిగా ఉండలేరు.

అలాగే ఇలాంటి పురుషులు వారి సొంత అవసరాలకు మాత్రం అమ్మాయిలను తెగ వాడుకుంటారు. అవసరం తీరిపోయాక అమ్మాయిలను ద్వేషిస్తారు. ఇలాంటి వారితో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇంతకీ ఇలాంటి అబ్బాయిలను ఎలా గుర్తు పట్టాలంటే.. వారి మాటలను,ప్రవర్తనను బట్టి ఇలాంటి వారిని గుర్తు పట్టవచ్చు.

ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంబంధాలు ఉంటాయి. సంబందాలు ఏర్పరచుకోవాలన్నా లేదా విచ్ఛిన్నం చేసుకోవాలన్నా అవి మన చేతుల్లోనే ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.

సంబంధాలు చాలా బలంగా ఉండాలని చెబుతారు. విచ్ఛిన్నమైతే, జీవితాంతం విచారం మాత్రమే మిగులుతుంది. మీరు కూడా అటువంటి సంబంధాలను కోరుకుంటున్నట్లై మీరు కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కో వ్యక్తికి ఒక్కో సమస్య ఉంటుంది.

అదే విధంగా ప్రేమకు సంబంధించినది. రిలేషన్షిప్ సరిగా లేనప్పుడు, మీరు సరిగా కొనసాగించకపోతే, మీకు దు:ఖాన్ని కలిగిస్తుంది.

కొట్లాటలు మీరు విచారంగా మరియు సంతోషంగా ఉన్నప్పుడు, మన మనస్సులోని మాటలను ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటాము.

కానీ మీ విషయాల గురించి మీ స్నేహితులకు చెప్పడం మంచిది కాదు. మీభాగస్వామితో గొడవపడిన కొంతకాలం తర్వాత మీరిద్దరూ మళ్లీ సాధారణం అవుతారు కాని మీ స్నేహితులు చాలా కాలం పాటు దీన్ని గుర్తుంచుకుంటారు.

జంటల మధ్య కొడవలు జరగడం సర్వసాధారణం కాని ఈ విషయంలో మీ స్నేహితులను నమ్మి వారితో పంచుకోవడం సరికాదు.

జీవితంలో మనుషులు రెండే రెండు సార్లు మారుతారు. ఆస్తులు , అంతస్తలు కాదు మనిషికి కావాలిసింది. అనుబంధాలు, ఆత్మీయతలు . ఆస్తులు కరిగిపోయిన బ్రతకగలము .

అనుబంధాలు దూరమైతే జీవించలేము. మీకు విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ విలువ ను పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి.

అభిమానించే వాళ్ళను, ప్రేమించే వాళ్ళను , సహాయం చేసే వాళ్ళను ఎప్పుడు దూరం చేసుకోకండి. ” ఒకరితో మన బంధం మంచిగా ఉంటే నిన్నటి గొడవలు నేటి సంబంధాలను గాయపరచలేవు ” .

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే .

ఒక పొరపాటు జరిగితే సవరించాలి కానీ ..!! మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. “సంబంధాలు ఎప్పుడూ మాములుగా చంప పడవు. అవి ఒకరి ప్రవర్తన వలన మాత్రమే చంపబడతాయి” .

నిన్ను భారం అనుకొనే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటిరిగా బ్రతకడమే సంతోషం. లోకంలో అతి పెద్ద ద్రోహం ఏంటో తెలుసా …ఒకరిపై అతిగా ప్రేమ చూపించి …అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడమే !!


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading