suresh

ఖతర్నాక్ లవర్స్… జల్సాల కోసం అడ్డదారులు తొక్కి చైన్ స్నాచింగ్‌లు

హైదరాబాద్ నగర శివారులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ప్రేమికులు అడ్డదారులు తొక్కి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. రోజూ బయటి తిరిగాలంటే డబ్బులు కావాలి. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశలో దొంగతనాలకు అలవాటు పడ్డారు. కాలం కలిసొచ్చినంత కాలం జనాల నుంచి బాగానే దోచుకున్నారు. చివరికి…

Read More

బంద్‌ ప్రశాంతం

మోదీ ప్రభుత్వ విధానాలపై కదంతొక్కిన కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21 వేలు చేయాలని, లేబర్‌ కోడ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, ఎన్‌ఆర్‌సీ, సీసీఏ, ఎన్‌పీఆర్‌ల రద్దు కోరుతూ వామపక్షాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. అన్ని జిల్లాల్లోనూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకులు, పాఠశాలలు, పరిశ్రమలు…

Read More

టీమిండియా ఘనవిజయం

ఇండోర్‌: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్‌ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్‌కు శ్రేయస్‌ అ‍య్యర్‌ జత కలిశాడు….

Read More

టీ20 సమరానికి లంకతో టీమిండియా ఢీ…

టీమిండియాతో ఆదివారం జరిగే తొలి టీ20 మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విజయంతో మొదలుపెట్టాలని టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో ఇరుజట్లు కఠోర సాధన చేస్తున్నారు. గౌహతీలోని బర్సపారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో…

Read More

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. స్పెషల్ రైళ్ల వివరాలు..

ఏటా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తుంటాయి. వాహనం కలిగి ఉన్నవారు ఏ ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంటారు. కానీ, హైదరాబాద్‌లో నివసించే పేద, మధ్యతరగతి వారు ప్రజా రవాణా ద్వారా ఊరికి వెళ్లాలంటే సముద్రం దాటినంతగా ప్రయాస పడాల్సి వస్తుంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండడం వల్ల పిల్లలతో ఇల్లు చేరాలంటే అదో ప్రయాసే. వీరికి కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు ఆర్టీసీ, ఇటు రైల్వే సాధ్యమైనంత వరకూ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులు నడుపుతుంటాయి….

Read More

గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు..

ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్‌లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు (CBDT) తాజాగా ఈ గడువును మరింత పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లింక్ చేసుకోవడానికి గుడువు ఇచ్చింది. ‘ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 31గా ఉంది. అయితే ఇప్పుడు ఈ డెడ్‌లైన్‌ను 2020 మార్చి 31 వరకు పొడిగించాం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్…

Read More

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్‌పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఉరుటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్‌, నమ్మి నాగ అప్పారావులను బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పని నిమిత్తం మునగపాక మండలం యాదగిరి పాలెం వెళ్తుండగా ఈ ఘటన…

Read More

అలీ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ స్టార్ కమెడియన్‌, టెలివిజన్‌ హోస్ట్‌ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్‌లో ఉన్న అలీ, ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్‌ బయలుదేరి వచ్చారు. జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్‌ తీసుకువచ్చారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జైతున్‌ బీబీ మృతి పట్ల టాలీవుడ్‌ సినీ ప్రముఖులు…

Read More

అమరావతిలో ఇంగ్లీష్ చిచ్చు..! తెలుగులో మొదలైన నేతల యుద్దం..! ఫైర్ అవ్వనున్న పవన్..!!

అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకూ ఇసుక కొరత మీత అట్టుడికిన అమరావతి ఒక్క సారిగా మలుపు తీసుకుంది. అందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర తీసారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తే పరవాలేదుగానీ వ్యక్తిగత ఆరోపణలు చేసి కొత్త వివాదానికి శ్రీకాంరం చుట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన…

Read More