‘సరిలేరు నీకెవ్వరు’ తో..మళ్ళీ కామెడీ పంచబోతున్న బండ్ల గణేశ్..రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.

bandla ganesh with sarileru nekevvaru

Teluguwonders:

‘ సూపర్ స్టార్ మహేశ్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. 👉’మహర్షి’ సక్సెస్‌తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరు’.

💥సరిలేరు నీకెవ్వరు’ specials :

సరిలేరు నీకెవ్వరు’ లో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఈ సినిమా లో నటించన్నారు.

👉పూర్తి వివరాల్లోకి వెళితే… ;

🔴highlight గా నిలువనున్న కామెడీ ట్రాక్‌ :

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌లో దిగిన ఫొటో ఒకటి సందడి చేసింది. ఈ పిక్‌లో రష్మిక, అనిల్ రావిపూడి, సీనియర్ హీరోయిన్ సంగీత ఉన్నారు. వీళ్లు దిగిన సెల్ఫీ ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలోనిదని అర్థమవుతోంది. ఇందులో బండ్ల గణేశ్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు.దాంతో నిర్మాత బండ్ల గణేశ్ చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు అర్ధం అవుతుంది. ఈ సినిమా లో బండ్ల గణేశ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్తగా చూపెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆయనతో నడిపించే కామెడీ ట్రాక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఆయనతో పాటు మరికొందరు యాక్టర్లను కేవలం కామెడీ సీన్ల కోసమే తీసుకున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో గతంలో వచ్చిన వార్తలకు బలం చేకూరినట్లైంది.

🔴రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ;

ఐతే తాజాగా ఈ సినిమాలో బండ్ల గణేశ్ లుక్‌కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. దీన్ని రివీల్ చేసింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్. ఈ సినిమాలో బండ్ల గణేశ్‌కు సంబంధించిన లుక్‌ను యాక్టర్, బిగ్ బాస్ ఫేమ్ హరితేజ రివీల్ చేసింది.

👉ట్రైన్ కామెడీ సీ క్వెన్స్ ;

సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా కనిపించినప్పటికీ కామెడీ ట్రాక్‌కే పెద్ద పీట వేశారని తెలుస్తోంది. సీరియస్ బోర్డర్ సీక్వెన్సెస్ తర్వాత మహేష్ కాశ్మీర్ నుంచి ఇంటికి వచ్చే ఎపిసోడ్ ఆసక్తికరంగా ప్లాన్ చేశారట. ఇందుకోసం ట్రైన్‌లో మహేష్, ఇతర నటీనటులతో హిలేరియస్ కామెడీ పండించాలని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట. అదే హైలైట్.. గతంలో చూడని విధంగా! సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఈ ట్రైన్ కామెడీ ట్రాకే హైలైట్‌గా నిలువనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సాధారణంగానే కామెడీ డోస్ అంటే ఇష్టపడే అనిల్ రావిపూడి.. ఈ ఎపిసోడ్ కోసం కామెడీకి మరింత డోస్ యాడ్ చేస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా కామెడీ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి. .. 💥 అంతే కాకుండా ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఈ సినిమా లో మహేష్ బాబుకి అత్త క్యారెక్టర్ లో నటించనుండటం విశేషం..


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights