April 7, 2026

బండ్లగూడలో భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాపు పూర్తిగా దగ్ధం

9e595464-658e-48f8-8436-68ed01f4b48e

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ పరిధిలోని బండ్లగూడలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.

మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. దీనిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కొంతసేపటి పాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.

ఈ ఘటనలో రెండో అంతస్తులో ఉన్న “సిద్ధి వినాయక టెక్స్‌టైల్స్” అనే బట్టల షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అసలు కారణంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading