BCCI: బీసీసీఐ నుంచి అగార్కర్, గంభీర్ ఔట్.. కట్‌చేస్తే.. ‘సిగ్గుచేటు’ అంటూ దిగ్గజ ప్లేయర్ పోస్ట్.. ఎందుకంటే?

Team India: ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టులో సంధికాలం నడుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ఎంపిక వంటి విషయాలపై క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు (Fake News) ఎంత వేగంగా ప్రచారమవుతాయో మరోసారి రుజువైంది. భారత క్రికెట్ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ నవజోత్ సింగ్ సిద్ధూ పేరుతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎంపిక కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్, ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని తయారుచేసిన ఒక నకిలీ పోస్ట్ తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయంలో సిద్ధూ వెంటనే స్పందించారు. ఆ వార్తలను ఖండిస్తూ, ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై ‘సిగ్గుచేటు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిద్ధూ పేరుతో వైరల్ అయిన నకిలీ పోస్ట్ ఏమిటి?
భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ వైరల్ అయింది. అందులో మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ చెప్పినట్లుగా ఒక వ్యాఖ్య ఉంది. “భారత్ 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవాలంటే, బీసీసీఐ వీలైనంత త్వరగా అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్‌లను వారి పదవుల నుంచి తొలగించాలి. తిరిగి రోహిత్ శర్మకు పూర్తి గౌరవంతో కెప్టెన్సీని అప్పగించాలి” అంటూ అందులో పేర్కొన్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్సీపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత వేగంగా వ్యాపించింది. దీంతో తన పేరుతో వైరల్ అవుతున్న ఈ నకిలీ పోస్ట్‌పై నవజోత్ సింగ్ సిద్ధూ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అసత్యం అని ఆయన తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. సిద్ధూ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు: “నేనెప్పుడూ అలా చెప్పలేదు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి. కనీసం నేనలా ఊహించుకోను కూడా. సిగ్గుచేటు” అంటూ పేర్కొన్నారు.
ఈ ఒక్క పోస్ట్‌తో సిద్ధూ, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వారికి గట్టి హెచ్చరిక పంపారు. సిద్ధూ స్పందించిన కొద్దిసేపటికే, ఆ నకిలీ పోస్ట్‌ను షేర్ చేసిన వినియోగదారు దాన్ని తొలగించారు.
టీమ్ ఇండియాలో కొనసాగుతున్న మార్పులు..
ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత జట్టులో సంధికాలం నడుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు, యువ ఆటగాళ్ల ఎంపిక వంటి విషయాలపై క్రికెట్ అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
తాజాగా శుభ్‌మన్ గిల్ వన్డే, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇలాంటి సమయంలో, అగార్కర్, గంభీర్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై సామాజిక మాధ్యమాల్లో నిరంతరం విశ్లేషణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధూ పేరును ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం గమనార్హం.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
