30నిమిషాల్లో పడక కేటాయించాలి

*30నిమిషాల్లో పడక కేటాయించాలి* *బెడ్ లభించలేదనే మాటే రాకూడదు* *కలెక్టర్లు, జేసీలదే బాధ్యత*
*కొవిడ్ నియంత్రణపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి జగన్*
అమరావతి:
లక్షకు పైగా కేసులున్నా.. సగం మందికి పైగా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.5% ఉంటే మన దగ్గర 1.06% ఉంది.
ఇది మన విజయం. ఎక్కువ కేసులు వస్తే భయపడిపోయి.. వాటి సంఖ్య తగ్గించి చూపేందుకు ప్రయత్నిస్తారు. కానీ మనం అలాంటి తప్పులు చేయలేదు. –
*సీఎం*_ కొవిడ్ రోగులకు ఆసుపత్రుల్లో 30 నిమిషాల్లోపు పడక కేటాయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి పడక లభించలేదనే మాటే రాకూడదని..
అలాంటి పరిస్థితి వస్తే కలెక్టర్లు, జేసీలను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. వైద్యం నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రుల్లోని పడకల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు.
రాబోయే ఆరు నెలలకు 17వేల మంది వైద్యులు, సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతిచ్చాం. ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకలు పెంచుతాం. రాష్ట్రస్థాయి ఆసుపత్రులలో రెమిడెసివర్ లాంటి ఖరీదైన మందులు అందుబాటులో ఉండాలి.
* ఎవరికైనా కొవిడ్ ఉన్నట్లు నిర్ధారణైతే వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా హోమ్ క్వారంటైన్, కొవిడ్ కేర్ సెంటర్, జిల్లా కొవిడ్ ఆసుపత్రి, రాష్ట్రస్థాయి కొవిడ్ ఆసుపత్రికి పంపించాలి. హోమ్ క్వారంటైన్‌లో ఉండేవారిని వైద్యులు సందర్శించి మందులు అందుతున్నాయా.. లేదా? చూడాలి. ఆసుపత్రుల్లో పడకలు అమ్ముకున్నట్లుగా కొన్ని రాష్ట్రాల ఘటనలు టీవీల్లో చూస్తున్నాం. ఇలాంటివి మన రాష్ట్రంలో రాకూడదు.
* కొవిడ్ లక్షణాలు తక్కువగా ఉన్నవారిని క్రిటికల్ కేర్ ఆసుపత్రులకు పంపక్కర్లేదు. పడకలను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థ ఉండాలి.
* వర్షాకాలం మొదలైంది. డయేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
