46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే: beer diet

n2593734009b63abb9f0cecf248d82611e6f78a584df408ff468724efb4db5c5a0366c4477.jpg

పెళ్లి.. బర్త్ డే.. చావు.. సంతోషం.. విచారం.. కోపం.. దుఖం.. బాధ.. ఎమోషన్ ఏదైనా మద్యం ఉండాల్సిందే. ఇవేవీ లేవు.. కాని తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరం లేదు అనే బ్యాచ్ కూడా ఒకటుందండోయ్… అయితే మద్యం తాగడంలో చాలా మంది ఎంపిక బీర్. అయితే, బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. బీరు సేవిస్తే ఉదర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇతర ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు. పానీయాలు తాగలేదు. కేవలం బీర్ మాత్రమే తాగాడు. అయితే ఏముందీ.. భారీగా బరువు పెరిగి ఉంటాడు.. అని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే..

అతను బరువు పెరగలేదు.. తగ్గాడు. అది కూడా చాలా ఎక్కువ బరువు తగ్గాడు. అవును, మీరు విన్నది నిజమే.అమెరికాలోని ఓహియోలో నివాసం ఉండే డెల్ హాల్ అనే వ్యక్తి సిన్సినాటిలోని ఫిఫ్టీ వెస్ట్ బ్రూయింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఓ వింత ఆలోచన వచ్చింది. అందరూ రక రకాల డైట్‌లను పాటిస్తున్నారు కదా.. తాను కూడా ఏదైనా వినూత్నమైన డైట్‌ను పాటిస్తే ఎలా ఉంటుంది ? అని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా వెంటనే బీర్ డైట్ ప్రారంభించాడు. 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగాడు. అది కూడా ఆకలి వేసినప్పుడు మాత్రమే. ఇతర ఏ ఆహారాలను, పానీయాలను తీసుకోలేదు. అయితే 46 రోజుల తరువాత షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి.
అలా డెల్ హాల్ 46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే తాగే సరికి అతను ఏమాత్రం బరువు పెరగలేదు సరికదా.. బరువు తగ్గాడు. అది కూడా.. 20 కేజీలకు పైగానే. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights