Best Camera Phones: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే! లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

best-camera-phones

ప్రపంచంలో బెస్ట్ కెమెరా ఫోన్ ఏదో తెలుసా? ఐఫోన్ లేదా శాంసంగ్ అనుకుంటున్నారా? కానే కాదు. వరల్డ్స్ బెస్ట్ కెమెరా ఫోన్స్ లో ఐఫోన్ మూడో స్థానంలో ఉంది. మరి మొదటి రెండు ఫోన్స్ ఏవి అనేగా మీ డౌట్.. ఓసారి లిస్ట్ చూసేయండి!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌లో వస్తున్న కెమెరాలు ప్రొఫెషనల్ కెమెరాలను తలపిస్తున్నాయి. చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌లు పోటీ పడి మరీ బెస్ట్ కెమెరా సెన్సర్స్ ను అందిస్తున్నాయి. చాలామంది బెస్ట్ కెమెరా ఫోన్ అంటే ఐఫోన్ అనుకుంటారు. కానీ, ఐఫోన్‌ను తలదన్నే కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి. మరి వరల్డ్స్ టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్‌ను చూసేద్దామా?

హువాయి ప్యూరా 80 అల్ట్రా

హువాయి ప్యూరా 80 అల్ట్రా (Huawei Pura 80 Ultra) మొబైల్..  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరా ఫోన్.  ఇందులో వన్ ఇంచ్ సెన్సార్‌ ఉంటుంది. అంటే సాధారణ కెమెరాల్లోని సెన్సర్ కంటే చాలా పెద్దది. ఇది 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్‌తో వస్తుంది. అలాగే ఇందులో మరో  40 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, మరో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమరాలు ఉన్నాయి. ఇవి ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ తో వస్తాయి. ఇందులో మ్యాన్యువల్ ఫొటోగ్రఫీ కోసం వేరియబుల్ అపర్చర్ సెటప్ ఉంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో ఇంకా లాంచ్ అవ్వలేదు.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 అల్ట్రా

బెస్ట్ కెమెరా ఫోన్స్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 అల్ట్రా (Oppo Find X8 Ultra) రెండవ స్థానంలో ఉంది. ఇందులో ఏకంగా ఐదు సెన్సార్లతో కూడిన కెమెరా సెటప్ ఉంది. ఒక 50 మెగాపిక్సెల్  వన్ ఇంచ్ సెన్సర్ తో పాటు మరో  50ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 50ఎంపీ 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50ఎంపీ 6ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో పాటు కలర్ టెంపరేచర్‌ను కంట్రోల్ చేయడానికి అదనంగా ఒక క్రోమా సెన్సార్ ఉన్నాయి. అయితే ఈ మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ కాలేదు.

యాపిల్ ఐఫోన్ 17 ప్రో

ఇకపోతే యాపిల్ ఐఫోన్ 17 ప్రో ఈ లిస్ట్ లో మూడవ స్థానంలో ఉంది. ఇందులో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అందులో ఒక 5ఎక్స్ టెలిఫోటో జూమ్ సెన్సర్ ఉంది. ఇందులో అడ్వాన్స్‌డ్  కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్స్ ఉన్నాయి. వీడియో రికార్డింగ్‌ ఫీచర్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇది ఇండియాలో కూడా అందుబాటులో ఉంది. ధర రూ. 1,34,900.

వివో ఎక్స్200 అల్ట్రా

బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్‌లో వివో ఎక్స్ 200 అల్ట్రా(Vivo X200 Ultra) నాల్గవ స్థానంలో ఉంది. ఇందులో నాలుగు కెమెరాలున్నాయి. అందులో జిస్( ZEISS) బ్రాండ్ కు చెందిన ఒక 50 ఎంపీ సెన్సర్ ఉంది. అలాగే మరో 50 ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సర్, ఒక 200 -మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్.. నైట్ టైం ఫొటోస్‌ తీయడంలో ఎక్స్‌పర్ట్. అయితే ఈ మొబైల్ కూడా ఇండియాలో లాంచ్ అవ్వలేదు.

గూగుల్ పిక్సె్ల్ 10 ప్రో ఎక్స్‌ఎల్

ఇక ఈ లిస్ట్ లో గూగుల్ పిక్సె్ల్10 ప్రో ఎక్స్‌ఎల్ (google pixel 10 pro xl) ఐదవ స్థానంలో ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది.  వీటిలో ఒక 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో పాటు 100 ఎక్స్ జూమ్‌తో కూడిన 48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఇది ఇండియాలో అందుబాటులో ఉంది. ధర రూ. 1,24,999.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights