Big Boss Episode 50 Highlights

Untitled design (68)

Teluguwonders:

⭐బిగ్ బాస్Episode 50 Highlights: ‘బిగ్ బాస్’ మూడో సీజన్ 49 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తిచేసుకుని 50వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ప్రత్యేకమైన ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ తీసుకున్నారు అనేకన్నా ప్రేక్షకులు తీసుకున్నారు అంటే బెటర్. ఎందుకంటే ఓట్లేసేది వాళ్లేకదా. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి ఫస్ట్ టైం నామినేట్ అయిన అలీ రెజా‌ను నిజంగానే సాగనంపేశారు.

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 50వ రోజుకి అడుగుపెట్టింది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌కి ‘గ్యాంగ్ లీడర్’ నానీని అతిథిగా ఆహ్వానించారు నాగార్జున. నాని తనదైన స్టైల్లో హౌస్‌మేట్స్‌‌పై జోకులు, పంచులు వేసి నవ్వించారు. పనిలో పనిగా తన ‘గ్యాంగ్ లీడర్’ను ప్రమోట్ కూడా చేసుకున్నారు.

🔴హౌస్ లోకి వెళ్తే :

వెంకటేష్ ‘గురు’ సినిమాలోని జింగిడి జింగిడి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ని పలకరించారు. 50 ఎపిసోడ్ సందర్భంగా షో ప్రారంభం నుంచి జరిగిన తతంగం మొత్తాన్ని హౌస్‌మేట్స్‌కి టీవీలో వేసి చూపించారు.

🔴పెన్సిల్ పార్థసారధిగా నాని ఎంట్రీ :

అనంతరం స్పెషల్ గెస్ట్ నానీని మంచి ఊపున్న పాటతో నాగార్జున ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఆ తరవాత నా…ని టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ని పలకరించారు.
నేచురల్ స్టార్‌ని నానీలా కాకుండా పెన్సిల్ పార్థసారధిగా ఇంటి సభ్యులకు నాగార్జున పరిచయం చేశారు. ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా పెన్సిల్‌కి పరిచయం చేసుకోండని చెప్పారు.

💥పరిచయ కార్యక్రమం :

బాబా భాస్కర్‌తో పరిచయ కార్యక్రమం మొదలుపెట్టారు. ‘మై నేమ్ ఈజ్ భాస్కర్ ఐ లవ్ కామెడీ’.. ఇలా అందరూ తమకు ఇష్టమైనదేంటో చెప్తూ పరిచయం చేసుకోవాలని చెప్పారు. 👉ఆ తరవాత నాని తాను ఒక స్క్రిప్ట్ అనుకొని అందులోని ఒక్కో పాత్రను ఒక్కో హౌస్‌మేట్‌కి ఇచ్చేశారు.
🔅బాబా భాస్కర్ – పాట మధ్యలో వచ్చే క్యామియో రోల్
🔅శిల్పా చక్రవర్తి – ఇంటెర్వల్‌కి ముందు ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్
🔅హిమజ – అండర్ డాగ్‌ రోల్.. మెల్లగా స్టార్ట్ అయ్యి ఆ తరవాత ఒక గ్రూపునే భయపెట్టే క్యారెక్టర్
🔅శివజ్యోతి – పల్లెటూరు నుంచి వచ్చి అక్కడున్న ఇన్నోసెన్స్‌ను స్ప్రెడ్ చేసే రోల్
🔅అలీ రెజా – మన్మథుడు సినిమాలో సునీల్ మాదిరి సడెన్‌గా కోపం వచ్చే క్యారెక్టర్
🔅శ్రీముఖి – సౌండ్, రీసౌండ్ ఉన్న రోల్
🔅రవికృష్ణ – ఇన్నోసెంట్‌గా ఉంటూ సినిమా ఆఖర్లో విలన్‌ వెనక నుంచి వచ్చే రోల్
🔅మహేష్ – చిత్తూరు యాసలో మంచి కామెడీ ఉన్న రోల్
🔅రాహుల్ – పులిహోర రాజా
🔅పునర్నవి – సిసింద్రీలా ఎంటర్ అయ్యి ఆటమ్ బాంబులా పేలే రోల్
🔅వితికా – ఇంట్లో వాళ్లందరినీ బాగా వాడేసుకుంటున్న ఒక కోడలు రోల్
🔅వరుణ్ సందేశ్ – ఫరెవర్ ప్రేమికుడు

💥 ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్‌ను :

శ్రీముఖి ఆనందం ఇలా అందరికీ ఒక్కో రోల్ ఇచ్చేసిన తరవాత ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్‌ను బిగ్ బాస్ ఇంటిలో ఉన్నవారందరికీ వేసి చూపించారు. ట్రైలర్‌ను చాలా ఆనందంగా వాళ్లంతా చూశారు. సూపర్ అన్నారు. నానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కానీ, నాగార్జున మాత్రం ట్రైలర్‌లో తనకు రొమాన్స్ తక్కువగా కనపడుతోందన్నారు. ఇలాంటివి నాగ్ సారే నోటీస్ చేస్తారంటూ నాని నవ్వించారు. ఆ తరవాత నాగార్జున ఎడమ చేతిపై వేయించుకున్న టాటూను నాని రివీల్ చేశారు. అనంతరం అందరికీ బైబై చెప్పి వెళ్లిపోయారు.నాని ఉన్నంత సేపు చాలా సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేసిన హౌస్‌మేట్స్ కొంత సేపటికి ఏడుపులు మొదలుపెట్టారు. దీనికి కారణం ఎలిమినేషన్.

👉ఎలిమినేషన్ రౌండ్ :

నామినేషన్‌లో ఉన్న అలీ, శ్రీముఖి, రవి, మహేష్‌లను నాగార్జున యాక్టివిటీ రూంలోకి వెళ్లమన్నారు. అక్కడ నలుగురిని వరుసగా నిలబెట్టి లైట్ ఎవరి మీద పడితే వారు సేఫ్ అని చెప్పారు. మొదట లైట్ శ్రీముఖి మీద పడింది. ఆ తరవాత లైట్ ఎవరి మీద పడితే వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పారు.

💥అలీ యు ఆర్ ఎలిమినేటెడ్:

అప్పుడు లైట్ అలీ మీద పడింది. అంతే, అందరూ షాక్. శివజ్యోతి, హిమజ, శ్రీముఖి ముఖాల్లో ఆశ్చర్యం. వాళ్లు నమ్మలేదు. కానీ, నాగార్జున.. అలీ యు ఆర్ ఎలిమినేటెడ్ అనగానే శివజ్యోతి ఏడుపు అందుకుంది. శ్రీముఖి అలీకి ఎదురెళ్లి గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. వరుణ్ సందేశ్, శివజ్యోతి, రవి, రాహుల్, బాబా భాస్కర్ అందరూ అలీని హత్తుకుని ఏడ్చేశారు. ఆ తరవాత అలీ ఇంట్లో నుంచి బయటికి వచ్చి నాగార్జునను కలిశాడు. అయితే, ఇంటి సభ్యులతో మారుసారి మాట్లాడే అవకాశాన్ని అలీకి నాగార్జున ఇచ్చారు. టెలిఫోన్ బూత్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడించారు. చాలా మంది ఏడుస్తూనే అలీతో మాట్లాడారు. అందరితో నవ్వుతూ మాట్లాడిన అలీ.. బాబా భాస్కర్ మాట్లాడినప్పుడు మాత్రం ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తానూ ఏడ్చేశారు. మొత్తం మీద గుండె నిండా బాధతో అలీ బిగ్ బాస్ షో నుంచి నిష్క్రమించాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights