బిగ్ బాస్ : వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ…

Big Boss: Varun Sandesh Real Life Story

Teluguwonders:

బిగ్ బాస్ సీజన్ 3 షో లో మనల్ని ఎంతగానో అలరిస్తున్నారు మన కంటిస్టెంట్స్ లో ఒకరైన మన తెలుగు ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఒడిశాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ కి మారడంతో అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. శేఖర్ కమ్ముల నిర్వహించిన హ్యాపీడేస్ చిత్రం కోసం నటన పోటీల్లో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించి, విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకుని, నటుడిగా స్థిరపడి హైదరాబాద్ కు తన మకాంను మార్చేశాడు.

ఆ తరువాత విభిన్న పాత్రల్లో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసి సుమారు 25 సినిమాల్లో చేయగా వీటిలో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు.

హ్యాపీడేస్ ,కొత్త బంగారు లోకం ,ఎవరైనా ఎప్పుడైనా ,కుర్రాడు, మరో చరిత్ర ,హ్యాపీ హ్యాపీ గా, ఏమైందీవేళ, కుదిరితే కప్పు కాఫీ, బ్రహ్మీగాడికథ, ప్రియుడు ,చమ్మక్ చల్లో ,ప్రియతమా నీవచట కుశలమా, సరదాగా అమ్మాయితో ,అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, డి ఫర్ దోపిడీ, నువ్వలా నేనిలా, పాండవులూ పాండవులూ తుమ్మెద, ఈ వర్షం సాక్షి గా ,పడ్డానండీ ప్రేమ లో మరి, మామ మంచు అల్లుడు కంచు, లవకుశ ,ఉదయం ,ట్వైస్, మర్లపులి ఈ సినిమాల ద్వారా తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయారు

2015లో నటి వితికాషేర్ ను వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత సినిమాలకు బాగా దూరమైపోయారు కానీ ఇటీవలే వచ్చిన “నువ్వు తోపురా” సినిమాలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అతని నటన ప్రశంసనీయం అని అనిపించుకున్నారు. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హౌస్ లోకి మిగిలిన కంటెస్టెంట్ లంతా ఒక్కొక్కరిగా వేదిక పైకి ఎంట్రీ ఇస్తే, వరుణ్ సందేశ్ ఆయన సతీమణి నటి వితికాషేర్ కలిసి తన సూపర్ హిట్ సినిమా కొత్త బంగారు లోకంలో ‘నిజంగా నువ్వే నా’ అనే పాటతో క్లాస్ లుక్ లో మొదట వరుణ్ సందేశ్ రాగా అదే సినిమాలోని నేనని నీవని పాటతో వరుణ్ సందేశ్ భార్య వితికా షేర్ స్టేజ్ పైకి దేవతలా దిగివచ్చి తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేయటమే కాకుండా హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జునను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

వరుణ్ సందేశ్ వేసుకొచ్చిన లేత గులాబీ రంగు సూటు భలే ఉందంటూ నాగార్జున కాంప్లిమెంట్ ఇచ్చారు.స్టేజ్ మీద వరుణ్ సందేశ్ మాట్లాడుతూ నేనే గెలుద్దాం అనుకుంటున్నాను కాని, తను గెలిచినా కూడా హ్యాపీనే ఎందుకంటే ఆమె నా భార్య ఆమె గెలిస్తే నేను గెలిచినట్టే అని సమాధానమిచ్చి నాగార్జునను ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత జంటగా వెళ్తున్నారు ఒక్కరిగా ఆడాలి అని వాళ్ళిద్దర్నీ నాగార్జున హౌస్ లోకి పంపించారు. ఇదిలా ఉండగా హౌస్ తొలి కెప్టెన్ గా వరుణ్ సందేశ్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని హౌస్ లో ఎవరు రూల్స్ పాటించకపోయినా పట్టించుకోవలసిన కెప్టెన్ పటించుకొలేదని దీనికి శిక్షగా వరుణ్ సందేశ్ ను సర్వర్ గా మార్చి, ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లిన లోపలికి వచ్చిన వరుణ్ డోర్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని,అలాగే ఆహారం కూడా ఇంటి సభ్యులకు వరుణ్ సందేశ్ అందించాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. మొత్తానికి తన స్టైల్ లో మన తెలుగు నటుడు వరుణ్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతగానో అలరిస్తున్నాడు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights