కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్ దఖావే భోసలే
కొత్త కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలకు తగినంతగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం లేదని భారతదేశం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే.. ఒక వైరాలజిస్ట్ కృషితో ఆ పరిస్థితి మారబోతోంది. ఆ వైరాలజిస్ట్ ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు.. దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం)ను తయారు చేసి అందించారు. మొట్టమొదటి మేడిన్ ఇండియా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్‌లోకి వచ్చింది. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ ఉందా, లేదా…