బఫెట్‌ను మించిన ముకేశ్‌

*బఫెట్‌ను మించిన ముకేశ్‌* *ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానం* *తొమ్మిదో స్థానానికి పెట్టుబడుల మాంత్రికుడు* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముకేశ్‌ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. సంపద విషయంలో పెట్టుబడుల మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ను అధిగమించారు. ◆ బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. గురువారం రోజున ముకేశ్‌ సంపద 68.3 బిలియన్‌ డాలర్లు(దాదాపు రూ.5.12 లక్షల కోట్లు)గా నమోదైంది. ◆ గురువారం నాటి బఫెట్‌ సంపద 67.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువ. మార్చిలో కనిష్ఠాలకు చేరిన…

Read More

‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

*‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!* *సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ* *12 కోట్ల మంది టిక్‌టాక్‌ యూజర్లే లక్ష్యంగా గాలం* *ఎస్సెమ్మెస్‌ల ద్వారా యూఆర్‌ఎల్‌ మాల్‌వేర్‌ లింకులు* *క్లిక్‌చేస్తే వ్యక్తిగత సమాచారం గల్లంతు: పోలీసుల హెచ్చరిక* *అటువంటి మెసేజ్‌లు వస్తే సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేయండి* హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరగాళ్లు రూటుమార్చారు. ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్‌ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీచేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ…

Read More

సైనికులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నాం*

*సైనికులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నాం* *విమర్శలకు సైన్యం సమాధానం* లేహ్‌ ఆసుపత్రిలో భారత సైనికులకు అందుతున్న చికిత్సను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు రావడంపై సైన్యం స్పందించింది. అవి హానికర, ఆధారాలు లేని ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ శుక్రవారం లేహ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పెద్ద హాలులో పడకలపై ఉన్న సైనికులను పరామర్శించారు. ఈ ఫొటోలను పలువురు షేర్‌ చేస్తూ.. అదసలు ఆస్పత్రిలా లేదని, పడకల వద్ద మందులు, సెలైన్‌ స్టాండులు, చికిత్స…

Read More

ఆన్‌లైన్‌ అయోమయమే

*ఆన్‌లైన్‌ అయోమయమే* *40 శాతం కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్‌ లేదు* *22 శాతం కుటుంబాల్లోనే పిల్లలకు ఫోన్‌ ఇచ్చే వెసులుబాటు* *ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదన్న 70 శాతం పిల్లలు* *పాఠశాలలను తెరవాలంటున్న తల్లిదండ్రులు* *బడుల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ విద్యపై టీఎస్‌యూటీఎఫ్‌ సర్వేలో వెల్లడి* ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిద్దామన్నా రాష్ట్రంలో అందుకు తగిన మౌలిక వసతులు లేవు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లే కాదు…దాదాపు 40 శాతం కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌…

Read More

*శాంతిని పునరుద్ధరించాలి

*శాంతిని పునరుద్ధరించాలి* *చైనా వేగవంతంగా చర్యలు చేపట్టాలి* *విదేశీ వ్యవహారాల శాఖ* దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో సత్వరం శాంతి, సుహృద్భావాలు నెలకొనేలా చైనా చర్యలు చేపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యేవరకు సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలూ కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు…

Read More

భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!

*భార‌త్‌లో క‌రోనా: 24 గంటల్లో 21వేల కేసులు!* *దేశంలో 18వేలు దాటిన క‌రోనా మ‌ర‌ణాలు!* *5రోజుల్లో ల‌క్ష కేసులు న‌మోదు* *నిన్న ఒక్క‌రోజే 20వేల మంది డిశ్చార్జి* భార‌త్‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌గా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది. గడి‌చిన 24గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 20,903 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డిన అనంత‌రం ఒక్క‌రోజులోనే ఈ స్థాయిలో న‌మోదుకావ‌డం ఇదే…

Read More

రెమిడెసివిర్‌.. మొత్తం అమెరికాకే

*రెమిడెసివిర్‌.. మొత్తం అమెరికాకే!* *వచ్చే 3 నెలలు ఇతర దేశాలకు దక్కేది శూన్యం* వాషింగ్టన్‌, లండన్‌: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నవేళ అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌పై పోరులో సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటివరకు తేలిన ఒకే ఒక్క ఔషధం ‘రెమిడెసివిర్‌’ రాబోయే మూడు నెలలపాటు తమకు మాత్రమే అందేలా సంబంధిత తయారీ సంస్థ ‘గిలీడ్‌’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సెప్టెంబరు వరకు ఇతర దేశాలేవీ ఈ ఔషధాన్ని పొందే అవకాశాలు లేవు….

Read More

భారత్‌ ధైర్యంగా నిలబడింది..!నిక్కీహేలీ

*భారత్‌ ధైర్యంగా నిలబడింది..!* *డ్రాగన్‌ యాప్‌ల నిషేధాన్ని ప్రశంసించిన * వాషింగ్టన్‌: చైనా వ్యవహార ధోరణిపై భారత్‌ వెనకడుగు వేయడంలేదని ఇండో-అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. ఇటీవల డ్రాగన్‌తో లద్ధాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ సోమవారం కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో టిక్‌టాక్‌‌తో పాటు యూసీ బ్రౌజర్‌, క్యామ్‌స్కాన్‌ తదితర యాప్‌లూ ఉన్నాయి. వాటి వాడకం వల్ల మన వ్యక్తిగత సమాచారంవిదేశీ సర్వర్లలో నిక్షిప్తం అవుతోందని,…

Read More

నవంబరు వరకు ఉచిత రేషన్‌

*నవంబరు వరకు ఉచిత రేషన్‌* *జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడి* *అన్‌లాక్‌-1 నుంచి ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని ఆవేదన* దిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలోని 80 కోట్ల మంది నిరుపేదలకు నవంబరు నెలాఖరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికోసం కేంద్రం రూ.90,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. గత మూడు నెలలుగా ఉచిత రేషన్‌పై చేసిన వ్యయాన్ని…

Read More