Chiranjeevi: విశ్వంభర రిలీజ్ డేట్ లీక్ చిరంజీవి.. అందుకే సినిమా ఆలస్యం అయ్యిందట

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాస్ హిట్ కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్ ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ తర్వాత బోళాశంకర్ అనే సినిమా చేశారు చిరు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కాస్తో బింబిసార దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలాంటి ఫాంటసీ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ట. ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు.
యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కనిపించనుందట. మొన్న మధ్య ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ మేరకు మెగాస్టార్ తో ఓ వీడియో చేశారు. సినిమా ఆలస్యం అవడం పై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫెక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని.. మెగాస్టార్ తెలిపారు. అలాగే ఈ సినిమా చిన్నపిల్లలను, పెద్ద వాళ్లను అలరిస్తుందని అన్నారు చిరు. అదేవిధంగా సినిమా ఓ చందమామ కథల హాయిగా సాగిపోతుంది.. అని చెప్తే సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని లీక్ ఇచ్చారు చిరంజీవి.
విశ్వంభర.. ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ. ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. రీసెంట్ టైమ్స్ లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది విశ్వంభర. విశ్వంభరకి మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం భీమ్స్ చేశారు. . ఈ సినిమాతో పాటే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా నయనతార నటిస్తుంది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
