చిరంజీవిపై అభిమానం తో అలా చేసిన కీర్తి సురేష్‌

chiranjeevi and keerthi suresh in siima awards

Teluguwonders:

‘మహానటి’గా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి అరుదైన గౌరవం పొందిన కీర్తి సురేష్ పేరు విదేశాల్లో కూడా మారు మోగిపోతోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తించబడిన ఈమె.. తాజాగా సైమా వేడుకలోనూ అదే ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకొని వహ్వా అనిపించింది.

🔴ఆ వివరాల లోకి వెళ్తే :

దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుంచి ఖతార్‌లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఎంతో అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.

🌟ముఖ్యఅతిథిగా మెగా స్టార్ :

ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా వెళ్లారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో భాగంగా సౌత్ ఇండియా భాషా చిత్రాల్లో ఉత్తమైన వాటిని ఎంపిక చేసి అవార్డులు ఇస్తారు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలకు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 👉ముఖ్యంగా మన తెలుగు తారల సందడి అక్కడ ఎక్కువగా కనిపించింది. రాధిక, త్రిష, నిధి అగర్వాల్, అనసూయ, పాయల్ రాజ్‌పుత్ సహా ఎంతో మంది నటీనటులు తళుక్కున మెరిశారు. 🎊తాజాగా జరిగిన ఈ సైమా అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి ఎంపిక కాగా.. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ కీర్తించబడింది. ఇలా కీర్తి సురేష్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఇటీవలే జాతీయ అవార్డు దక్కడం, ఆ వెంటనే సైమా అవార్డు పొందటం పట్ల కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

🔴 మహానటి కి ప్రశంస‌ల వెల్లువ :

‘మ‌హాన‌టి’ చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ న‌టిగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే కీర్తికి సినీ ప‌రిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంస‌లు వెల్లువెత్తాయి.

🌟కీర్తి విధేయతకు మెగా ప్రశంసలు :

ఖతార్ రాజధాని దోహాలో జరుగుతోన్న ‘సైమా’ అవార్డుల వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయిన కీర్తి సురేష్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మహానటి సావిత్రిని తలపించేలా సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చిన కీర్తి.. చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు. కుర్చీలో కూర్చున్న చిరంజీవి ద్దకు వెళ్లిన కీర్తి.. ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ మోకాళ్లపై కూర్చొని ముచ్చట్లాడారు. చిరంజీవి కూడా కీర్తి చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఈ ఫొటో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కీర్తి అభిమానులైతే ఆమె విధేయతకు ఫిదా అయిపోతున్నారు. అందుకే ఉత్తమ నటి అవార్డు కీర్తినే వరించిందని ప్రసంశిస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి సైతం కీర్తి సురేష్‌ను, ‘మహానటి’ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇప్పుడు నేరుగా కీర్తి సురేష్‌కు తన ఆశీస్సులు అందజేశారు.

💥ఆనందంలో మెగా ఫ్యాన్స్‌ :

సైమా అవార్డ్స్ వేడుకలో చిరంజీవిపై కీర్తి సురేష్ చూపిన అభిమానం మెగా ఫ్యాన్స్‌ని ఆనందంలో ముంచెత్తుతోంది. తెలుగు సినిమా రారాజుగా వెలుగొందుతున్న చిరంజీవి ఎంతో వినమ్రంగా కూర్చొని.. నవ్వుతూ కీర్తి మాట్లాడిన దృశ్యం.. ఈ పిక్ చూపరులను బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights