CIBIL స్కోర్ ఎలా లెక్కిస్తారు? ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు?

CIBIL Score: ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీ స్కోరులో మిగిలిన 20% మీ ఇతర రుణ కార్యకలాపాల ద్వారా ప్రభావితమవుతుంది. ఉదాహరణకు మీరు ఇటీవల ఎన్ని కొత్త రుణాలు తీసుకున్నారో కూడా లెక్కిస్తారు. మీరు ఎన్ని ఖాతాలను తెరిచారు లేదా..
CIBIL Score: సిబిల్ స్కోర్ అనేది ఆర్థిక చరిత్రరిపోర్ట్ కార్డ్ లాంటిది. ఈ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ మంచిదని పరిగణిస్తారు. స్కోరు ఎంత మెరుగ్గా ఉంటే మీకు రుణం పొందే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీ లావాదేవీలను సరిగ్గా నిర్వహించడం ద్వారా మీరు దాన్ని మెరుగుపరచవచ్చు. కానీ దానికి ముందు CIBIL స్కోర్ ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం.
- చెల్లింపు చరిత్ర: మీ సిబిల్ స్కోర్‌ను నిర్మించడంలో మీ చెల్లింపు చరిత్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ EMIలను సకాలంలో చెల్లించారా లేదా అనేది పరిగణనలోకి తీసుకుంటుంది. మీరు ఆలస్యంగా చెల్లించినట్లయితే ప్రభావం చాలా ఉంటుంది. సిబిల్ స్కోర్‌లో మీరు సమయానికి చెల్లించని ఈఎంఐల సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది స్కోరు గణనలో దాదాపు 30% దోహదపడుతుంది.
- క్రెడిట్ ఎక్స్‌పోజర్: తరువాత మీ పేరులోని మొత్తం రుణం (క్రెడిట్ పరిమితి), మీరు ఎంత ఉపయోగించారో పరిగణనలోకి తీసుకుంటారు. దీనిని క్రెడిట్ ఎక్స్‌పోజర్ అంటారు. మీరు మీ క్రెడిట్ పరిమితిలో ఎక్కువ భాగాన్ని ఉపయోగిస్తే అది మీ CIBIL స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అంశం దాదాపు 25% దోహదపడుతుంది.
- క్రెడిట్ రకం, వ్యవధి: CIBIL స్కోర్‌ను రూపొందించేటప్పుడు మీరు కలిగి ఉన్న రుణ రకం – సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్ – కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీరు ఎక్కువగా సెక్యూర్డ్ రుణాలు (గృహ రుణాలు, కారు రుణాలు వంటివి) కలిగి ఉంటే, స్కోరు మెరుగ్గా ఉంటుంది. రుణ వ్యవధి కూడా ముఖ్యం. మీ క్రెడిట్ చరిత్ర ఎంత ఎక్కువైతే అది అంత మెరుగ్గా పరిగణిస్తారు. ఈ అంశం దాదాపు 25% ఉంటుంది.
- ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మీ స్కోరులో మిగిలిన 20% మీ ఇతర రుణ కార్యకలాపాల ద్వారా ప్రభావితమవుతుంది. ఉదాహరణకు మీరు ఇటీవల ఎన్ని కొత్త రుణాలు తీసుకున్నారో కూడా లెక్కిస్తారు. మీరు ఎన్ని ఖాతాలను తెరిచారు లేదా మూసివేశారు. మీ క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిష్పత్తి 30-40% మించకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే స్కోరు తగ్గవచ్చు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
