Cloudburst in J&K: మళ్ళీ కశ్మీర్లో మేఘాల విస్ఫోటన.. ముగ్గురు మృతి.. పలువురు గల్లంతు.. కొట్టుకు పోయిన ఇళ్లు..

jammu-and-kashmir-rains

జమ్మూ కాశ్మీర్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంఘటన జరిగింది. రాంబన్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతంలో మేఘ విస్పోటనం సంభవించింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వరద నీటి ప్రభావంలో చాలా మంది కొట్టుకుని పోయారు.. వారి ఆచూకీ ఇంకా లభించనట్లు సమాచారం. ఆకస్మిక వరద కారణంగా చాలా మంది ఇళ్లు నేలమట్టమయ్యాయి

జమ్మూ కాశ్మీర్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి రాంబన్‌లోని రాజ్‌గఢ్ ప్రాంతంలో (భారీ వర్షాలు కురవడమే క్లౌడ్‌ బరస్ట్‌ లేదా మేఘాల విస్ఫోటం) క్లౌడ్ బరస్ట్ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. చాలా మంది తప్పిపోయినట్లు సమాచారం. దీనితో పాటు భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్ళు వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

అయితే స్థానిక యంత్రాంగం సంఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను వెతకడం ప్రారంభించాయి. సంఘటన స్థలంలో నిరంతర సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజల కోసం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, వారిని అక్కడికి తరలిస్తున్నారు. దీనితో పాటు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు,  మేఘ విస్పోటనం కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయని,  వాటి నీటి మట్టం వేగంగా పెరుగుతోందని స్థానిక యంత్రాంగం తెలిపింది. ఈ పరిస్థితిలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జమ్మూలోని వివిధ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘ విస్పోటనం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారని,  గల్లంతయ్యారని కూడా స్థానిక యంత్రాంగం తెలిపింది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights