డ్వాక్రా మహిళల”కి గుడ్ న్యూస్…!

AP-NEWS: రుణమాఫీ పై మొదలైన ప్రక్రియ…!!
వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా..!
తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు.
అందుకు తగ్గట్టుగానే “వైఎస్ఆర్ ఆసరా” పధకంపై సమీక్షలు జరిపిన జగన్ ఆ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు..
ఇప్పటివరకూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వారి అప్పు ఖాతాలలో ఉన్న సొమ్ము ఎంత, అనే విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జిల్లా కలక్టర్లు ఈ వివరాలని సేకరించి ప్రభుత్వానికి తెలిపాలని ఆదేశించారు. దాంతో ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఆయా సంఘాల వివరాలని ఓ నివేదికలో పొందు పరిచి ఉన్నత అధికారులకి అందచేస్తున్నారు.
అతి త్వరలోనే జగన్ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత డ్వాక్రా రుణమాఫీ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
https://teluguwonders.com
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
